ఇలా చేస్తే పొక్కుల ఇబ్బంది లేదిక

ఇలా చేస్తే  పొక్కుల ఇబ్బంది లేదిక
x
Highlights

చాలా మందికి నోటిపక్కనో, లోపలో, పెదవుల చివరిలోనో దురదలా మొదలై చిన్న పొక్కుల్లా ఏర్పాడుతాయి. కొద్ది రోజులు పుండుగా ఉండి, క్రమంగా ఎండి, చాలా రోజులకు...

చాలా మందికి నోటిపక్కనో, లోపలో, పెదవుల చివరిలోనో దురదలా మొదలై చిన్న పొక్కుల్లా ఏర్పాడుతాయి. కొద్ది రోజులు పుండుగా ఉండి, క్రమంగా ఎండి, చాలా రోజులకు తగ్గుతుంటాయి. ఇవి ఉన్న సమయంలో పెదవులకు నొప్పి విపరితంగా ఉంటుంది. నొప్పి సంగతి అలా ఉంచితే ఇవి తొందరగా తగ్గవు.

పెదవులకి పక్కగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. కోల్డ్‌సోర్స్‌గా పిలిచే ఈ పొక్కులు వైరస్‌ల కారణంగా వస్తాయి. పొక్కు రావడానికి ముందు దురద మొదలవుతుంది. వీటిని వివారించడానికి కొబ్బరినూనెలో దూదిని ముంచి అక్కడ గంటకోసారి పెట్టడం వల్ల అందులోని లారిక్‌ ఆమ్లం, ఓలియాక్‌ ఆమ్లాలు వైరస్‌ను నాశనం చేస్తాయి. ఐస్‌క్యూబ్‌తో రుద్దడం వల్ల కూడా దురద తగ్గి తొందరగా మానుతాయి.

అలాగే దూదిని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లో ముంచి మూడు గంటలకోసారి పొక్కుల మీద రాసుకుంటే త్వరగా ఎండి మచ్చపడకుండా ఉంటాయి. అలాగే వెల్లుల్లి రెబ్బను దంచి ఆ రసాన్ని పొక్కుమీద పెడితే ఫలితం ఉంటుంది. లేదంటే పరగడుపున రెండు రెబ్బల్ని తిన్నా కూడా అవి త్వరగా తగ్గుతాయి. అలా కాకుండా చిటికెడు సముద్ర ఉప్పును తీసుకుని దాన్ని

ఆ పొక్కుల మీద అరనిమిషం పాటు నొక్కి పెట్టాలి. ఇలా రోజుకి రెండుమూడుసార్లు చేస్తే అవి త్వరగా మానిపోతాయి. రోజుకి రెండుమూడు సార్లు తేనెని పొక్కుల మీద రాసి కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే ఫలితం ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories