మలేరియా వ్యాధి ఎలా సోకుతుంది?..రక్తం రుచి మరిగిన ఆడ దోమ శరీరంపై ఎలా దాడి చేస్తుంది?

Oxford University, Serum Institute of India Deliver R21/Matrix-M Malaria Vaccine
x

మలేరియా వ్యాధి ఎలా సోకుతుంది?..రక్తం రుచి మరిగిన ఆడ దోమ శరీరంపై ఎలా దాడి చేస్తుంది?

Highlights

మలేరియా వ్యాధి ఎలా సోకుతుంది?..రక్తం రుచి మరిగిన ఆడ దోమ శరీరంపై ఎలా దాడి చేస్తుంది?

R21/Matrix-M Vaccine: మలేరియా! కొన్ని శతాబ్దాలుగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధితో 6 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. మనిషిని చావ దెబ్బ తీస్తున్న ఈ వ్యాధి నుంచి సురక్షితంగా ఉండేలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)లు వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నాయి. ఆ పరిశోధనలో సత్ఫలితాలు రావడంతో.. తాజాగా ఆ వ్యాక్సిన్ ను వెస్ట్ ఆఫ్రికా దేశమైన ఘనాలో వినియోగించేందుకు ఆఫ్రికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ అనుమతి ఇచ్చింది.

తద్వారా ఎక్కువ మరణాలు సంభవించే 5 నుంచి 36 నెలల పిల్లలకు ఆర్ 21/ మ్యాట్రిక్స్ - ఎం (R21/Matrix-M)అని పిలిచే ఈ మలేరియా వ్యాక్సిన్ ను వేయొచ్చు. అంతేకాదు మలేరియా వ్యాక్సిన్‌ను ఏ దేశంలోనైనా ఉపయోగించేందుకు రెగ్యులేటరీ క్లియరెన్స్‌ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందుబాటులో వందల మిలియన్ల టీకాలు

ఈ సందర్భంగా.. 'ఆక్స్‌ఫర్డ్‌లో ఈ వ్యాక్సిన్ తయారీ, పరిశోధన, పరీక్షలు... అన్నింటికీ కలిపి మొత్తం 30 ఏళ్ల సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో అవసరమైన దేశాలకు తగిన స్థాయిలో సరఫరా చేయగల అధిక సమర్థత వ్యాక్సిన్ రూపకల్పన, సదుపాయాలు ఉన్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అడ్రియన్ హిల్' చెప్పారు. భారీ మొత్తంలో తయారు చేసిన వ్యాక్సిన్ ఆమోద యోగ్యమైన ధరతో మలేరియాతో బాధపడుతున్న ఆఫ్రికా దేశాల్లో వందల మిలియన్ల కొద్దీ టీకాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.

మా లక్ష్యం అదే

ఆర్ 21/ మ్యాట్రిక్స్ - ఎం మలేరియా వ్యాక్సిన్ ను ఘనాలో వినియోగించేందుకు అనుమతులు రావడం.. ప్రపంచవ్యాప్తంగా మలేరియాను ఎదుర్కోవడానికి మా ప్రయత్నాలలో ముఖ్యమైన మైలురాయి'.అని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రపంచ దేశాల్లోని బాధితులకు మలేరియా వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్ధేశించారు.

3వ దశ ట్రయల్స్ ఫలితాలు అప్పుడే

R21/Matrix-M టీకాను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రూపొందించబడింది. యూకే, థాయ్‌లాండ్ తోపాటు అనేక ఆఫ్రికన్ దేశాలలో క్లినికల్ ట్రయల్స్‌ జరిగాయి. బుర్కినా ఫాసో, కెన్యా, మాలి, టాంజానియాలో 3వ దశ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ ఫలితాలు ఈ సంవత్సరం చివరిలో విడుదల కానున్నాయి.

మలేరియా వ్యాధి ఎలా సోకుతుంది?

ఎనాఫిలిస్‌ దోమ. మనిషి మీద మలేరియా రూపంలో బ్రతికే పరాన్న జీవిని వ్యాపింప చేస్తుంది. ఇది కేవలం రక్తం రుచి మరిగిన ఆడ దోమ. రక్తం పీల్చు కునేందుకు అనువుగా ఆడ ఎనాఫిలిస్ దోమ శరీరంలో సపరేటుగా అవయవ పొందిక ఉంటుంది. పై చర్మం నుంచి సూది మొన లాంటి దాని ముక్కును శరీరంలోకి దించుతుంది. ఇదే సమయంలో నోటి నుంచి లాలాజలాన్ని దానితో పాటే 50వేలకు పైగా ప్లాస్మోడియా అనే పరాన్నజీవులను శరీరంలోకి పంపడంతో ఎనాఫిలిస్ దోమ కథ ముగుస్తుంది.

వేలల్లో ఉన్న ప్లాస్మోడియం లో రెండు డజన్లు మాత్రమే రక్త ప్రసరణలో కలిసిపోతాయి. రక్తంలో కలిసిపోయిన పరాన్నజీవులు కొద్ది నిమిషాల సేపు మాత్రమే బతికుంటాయి. ఈలోపే వివిధ శరీర భాగాల నుంచి లివర్ సెల్ కు చేరుకొని అక్కడితో ఆగిపోతాయి. రాత్రి పూట నిద్రలో దాడి చేసే దోమ కాటు బాధ అంత పెద్దగా తెలియదు గాని.. దాని కాటు పడ్డ ఒకటి, రెండు వారాల తర్వాత దాని తీవ్రత తెలుస్తుంది. పోలియో, స్మాల్ పాక్స్ వంటి మహ్మారిలను గెలవగలిగినా మలేరియాతో పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ - ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు తయారు చేసిన మలేరియా టీకా అందుబాటులోకి రావడం శుభపరిణామమని ఆరోగ్య రంగ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories