Oral Health: ఈ 7 ఆహారాలు పంటి ఆరోగ్యానికి ఎంతో మేలు..!

Oral Health Foods Top Foods to Boost Your Tooth and Gum Health Naturally
x

Oral Health: ఈ 7 ఆహారాలు పంటి ఆరోగ్యానికి ఎంతో మేలు..!

Highlights

Oral Healthy Foods: ఆరోగ్యకరమైన పంటికి కొన్ని ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి పంటికి, చిగుళ్ల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. నోటి పుండ్లు, దుర్వాసనకు కూడా చెక్‌ పెడుతుంది.

Oral Healthy Foods: కొన్ని రకాల ఆహారాలు పంటి ఆరోగ్యానికి మేలు చేస్తే, మరికొన్ని ఆహారాలు పంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని రకాల ఆహారాలు తింటే పంటి ఆరోగ్యంతోపాటు చిగుళ్ల వ్యాధుల నుంచి కాపాడుతుంది.

పాల ఉత్పత్తులు..

పాల ఉత్పత్తుల్లో ప్రధానంగా ఫాస్‌ఫరస్‌, క్యాల్షియం, కెసెయిన్‌ ఉంటుంది. ఇది పంటి ఎనమిల్‌ను మెరుగు చేస్తుంది. ఇవి పన్లు డ్యామేజ్‌ కాకుండా యాసిడిక్‌ ఆహారాలకు చెక్‌ పెడుతుంది. అంతేకాదు పంటిలో ఆరోగ్యకరమైన బ్యాక్టిరియాకు తోడ్పడుతుంది.

పండ్లు, కూరగాయలు..

క్రంచీగా ఉండే పండ్లు నేచురల్‌ టూత్‌ బ్రష్‌లా పనిచేస్తాయి. వీటిని నమిలినప్పుడు ఫుడ్‌ పార్టికల్స్‌, ప్లేక్స్‌ను తొలగిస్తుంది. యాపిల్‌ వంటివి తీసుకోవాలి. అంతేకాదు ఇవి సలైవాను యాక్టివేట్‌ చేస్తుంది. బ్యాక్టిరియాను కూడా తొలగిస్తుంది. సెలరీ, క్యారట్లలో హై ఫైబర్‌ ఉంటుంది. అంతేకాదు ఈ పండ్లలో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇందులోని విటమిన్‌ ఏ, సీ చిగుళ్లను ఒక షీల్డ్‌లా పనిచేస్తాయి.

ఆకుకూరలు..

ఆకుకూరల్లో క్యాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సీ ఆరోగ్యకరమైన చిగుళ్లు, పంటికి తోడ్పడుతుంది. ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ చిగుళ్ల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఆకుకూరల్లో ఫైబర్‌ సలైవా ఉత్పత్తికి తోడ్పడుతుంది.

కొవ్వు చేపలు..

కొవ్వు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ డీ ఉంటుంది. చేపల్లో ఒమేగా 3s యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. కొవ్వు చేపల్లోని విటమిన్‌ డీ క్యాల్షియం త్వరగా గ్రహిస్తుంది. మీ ఎముకలు, పళ్లు గట్టిగా మారతాయి.

నీళ్లు..

నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇది మనం తిన్న ఫుడ్ పార్టికల్స్‌ను తొలగిస్తుంది. పంటిపై బ్యాక్టిరియా, యాసిడ్‌ను తొలగిస్తుంది. దీంతో మీ నోరు పరిశుభ్రంగా ఉంటుంది. కెవిటీలను నివారిస్తాయి. పంటి ఆరోగ్యానికి క్యాల్షియం, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మన పంటిని ఒక షీల్డ్‌లా పనిచేస్తాయి.

గ్రీన్‌ టీ..

గ్రీన్‌ టీ కెటచిన్స్‌ ఉంటాయి. ఇది మన నోట్లో చెడు బ్యాక్టిరియా పెరగకుండా కాపాడుతుంది. గ్రీన్‌ టీ లో ఫ్లోరైడ్‌ ఉంటుంది. పళ్లు పాడవ్వకుండా పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories