ఉల్లితో అందమైన జుట్టు

ఉల్లితో అందమైన జుట్టు
x
Highlights

ఉల్లిలోని పోషకాలు జట్టును మరింత బలంగా మార్చి వాటి పెరుగుదలకు దోహదపడుతాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే సల్ఫర్‌ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది....

ఉల్లిలోని పోషకాలు జట్టును మరింత బలంగా మార్చి వాటి పెరుగుదలకు దోహదపడుతాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే సల్ఫర్‌ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంధ్రాలు తిరిగి తెరుచుకుంటాయి. ఇక ఉల్లిరసరం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. జుట్టులో ఉన్న ఫంగ్‌సని ఉల్లి హరింపజేస్తుంది. చుండ్రును నివారించి తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కల్పించే ఈ ఉల్లిరసాన్ని వారంలో మూడుసార్లు తలకు పట్టిస్తే రెండునెలల్లో ఎన్నో ఫలితాలు పొందవచ్చు. ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్‌ చేసి వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం ఈ ఉల్లి పేస్టును ఒక బుట్టలో తీసుకుని రసం పిండాలి. ఈ రసాన్ని తలకు పట్టించి ఐదు నిమిషాలపాటు మృదువుగా మసాజ్‌ చేయాలి, ఇలా చేసిన అనంతరం 45 నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే ఉల్లిపాయ రసంలో క్యాటలైజ్‌ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories