పాతబాటిళ్లతో ఇలా ఉపయోగించుకోవచ్చు..

పాతబాటిళ్లతో ఇలా ఉపయోగించుకోవచ్చు..
x
Highlights

మన ఇంట్లో ఉండే పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను పడేయకుండా వాటిని వివిధ రకాలు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా వాటిని వంటింట్లో పప్పు దినుసులు నిల్వచేసుకునే...

మన ఇంట్లో ఉండే పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను పడేయకుండా వాటిని వివిధ రకాలు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా వాటిని వంటింట్లో పప్పు దినుసులు నిల్వచేసుకునే కంటెయినర్లుగా ఉపయోగించొచ్చు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను కంటెయినర్లుగా మార్చేందుకు రెండు పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌, క్రాఫ్ట్‌ నైఫ్‌, ఉంటే చాలు వాటిని ఎలా కంటెయినర్లుగా మార్చుకోవాలో చూద్దాం...

ఏ ప్లాస్టిక్‌ బాటిల్‌నైతే మార్చుకోవాలి అనుకుంటున్నామో దాన్ని ముందుగా వాటిని వేడినీళ్లలో కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల బాటిల్స్‌ మీద ఉన్న లేబుల్‌ తొలగించడం సులువుగా తొలిగిపోతుంది.అలాగే బాటిల్స్‌ కూడా బాగా శుభ్రం అవుతాయి. తర్వాత. రెండు వేరు వేరు సైజులున్న ప్లాస్టిక్‌ బాటిల్స్‌ తీసుకోవాలి. ఒకటి పొడవుగా, రెండోది చిన్నగా ఉండాలి. పొడవుగా ఉన్న బాటిల్‌ను బేస్‌గా వాడాలి. చిన్న బాటిల్‌ మూతగా ఉపయోగపడుతుంది మనం సాధరణంగా ఉపయోగించే డబ్బా లాగనే బాటిల్స్‌ను సెట్‌ చేయొచ్చు. ఈ ప్లాస్టిక్‌ డబ్బాల్లో బియ్యం, బీన్స్‌, నూడుల్స్‌, పంచదార వంటి పొడి పదార్థాలను నిల్వ చేసుకోవచ్చు.ఈ బాటిల్స్‌లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ వీటిలో పదార్ధాలను ఉంచడం ద్వారా వంటగదిలో ఏయే పదార్థాలు ఉన్నాయి. ఏవి లేవు అనేది ఈజీగా కనపడుతుంది. అలాగే మెుక్కలు నీరు పోయాడానికి పాత ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించుకోవచ్చు. చిన్న స్పికర్లను బాటిల్‌కు ఆమర్చి దాన్ని మెుక్కలకు నీటిని పోయడానికి వాడోచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories