అదిరిపోయే ఫీచర్లతో నోకియా టీవీ.. మార్కెట్ లో ఇక పోటీ షూరు

అదిరిపోయే ఫీచర్లతో నోకియా టీవీ.. మార్కెట్ లో ఇక పోటీ షూరు
x
Nokia 55-inch 4K Smart TV
Highlights

నోకియా సంస్థలు చెందిన మొబల్స్ పై వినియోగదారులకు ఓ మంచి అభిప్రాయం ఉంటుంది. తాజాగా నోకియా మరో ప్రస్థానం మొదలు పెట్టింది.

నోకియా సంస్థలు చెందిన మొబల్స్ పై వినియోగదారులకు ఓ మంచి అభిప్రాయం ఉంటుంది. తాజాగా నోకియా మరో ప్రస్థానం మొదలు పెట్టింది. నోకియా మొదటి సారి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. నోకియా తయారు చేసిన స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ టీవీలో అద్భుతమైన ఫీచర్లు తీసుకొచ్చింది. వినియోగదారుడికి అందుబాటు ధరల్లోనే ఈ టీవీని రూపొందించింది.

మొబైల్ కంపెనీలు షియోమీ, మోటొరోలా వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే టీవీ విభాగంలో ప్రవేశించాయి. తాజా నోకియా కూడా స్మార్ట్ టీవీని రూపొందించడంతో మార్కెట్లో గట్టిపోటీనే ఉంటుంది. నోకియా రూపొందించిన టీవీ వివరాలు చూస్తే..4k టీవీ 55 అంగుళాల ఉంటుంది. దీని ధరను 41,999 రూపాయలగా కంపెనీ నిర్ణయించింది.

దీనికి సంబంధించిన డిల్ డిసెంబర్ పదిన మధ్యాహ్నాం12 గంటలకు ఉంటుంది. టీవీ కొనుగోలు చేసేటప్పుడు పేమెంట్స్ డెబిట్ , క్రెడిట్ కార్డులపై రెండు వేల రూపాయలు తగ్గింపు ఉంటుంది. రెండు సంవత్సరాలు ప్రోటక్షన్ ప్లాన్ ఉంది. స్మార్ట్ టీవీలో ఆల్ట్రా హెచ్డీతో దీని తెర ఉంటుంది. వైడ్ కలర్ గాముట్ ఫీచర్ తో రంగులు స్పష్టంగాకనిస్తాయి.

ఈ స్మార్ట్ టీవీలో డిజైన్ అద్బుతంగా ఉంది. స్లీమ్‌గా ఈ టీవీని రూపొందించారు. టీవీ లూక్ కూడా చక్కగా రూపొందిచారు. ఈ టీవీకి వైఫైకి కనెక్ట్ సదుపాయం ఉంది. 3హెచ్ డీఎంఐ పోర్టులు 2యూఎస్ బీ పోర్టులను సౌలభ్యం ఉంది. 2.25 జీబీ ర్యామ్ ఉంది. ‎‎16 జీబీగా ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. టీవీలో ఆడియో పిచ్చరుకు తగ్గట్టుగానే ఉంటుంది. నోకియా టీవీలో జేబీఎల్ ను ఇందులో తొలిసారిగా జత చేశారు. దీంతో 5.1 చానల్ శాబ్ధన్ని అందిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories