అదిరిపోయే ఫీచర్లతో నోకియా కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

అదిరిపోయే ఫీచర్లతో నోకియా కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?
x
Highlights

నోకియా అంటే ఇప్పటికీ వినియోగదారులకు ఓ నమ్మకం.

నోకియా అంటే ఇప్పటికీ వినియోగదారులకు ఓ నమ్మకం. అయితే నోకియా సంస్థ మరో స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నోకియాకు చెందిన 2.3 స్మార్ట్ ఫోన్ భారత దేశంలో అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ల రంగంలో నోకియా తన బ్రాండ్ మార్క్ నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే నోకియా నుంచి 5,6.1 7.1 ఇలా అనేక వర్షన్ల్ వచ్చాయి. కాగా తాజాగా వచ్చిన ఈ 2.3 స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ ఫోన్ పేరు 2.3 , ఫోన్ 9 Pie స్టాక్ ఆండ్రాయిడ్ సిస్టం సపోర్టు చేస్తుంది. 6.2 అంగుళాల Hd డిస్ ప్లే ఇందులో ఉంది. దీనికి చెందిన డిస్ ప్లే వాటర్ డ్రాప్ నాచ్ స్టైల్‌లో ఉంటుంది. ఈ ఫోన్‌లో హీలియో ఏ22 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 2 జీబీ ర్యామ్ , 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉండనుంది. ఇందులో బ్యా్క్ సైడ్ రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా 13 మెగా పిక్సెల్, మరో కెమెరా 2 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉంది. కెమెరాకు డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఫ్రాంట్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లను మార్చి 31లోపు కొనుగోలు చేస్తే ఒక ఏడాది పాటు రీప్లేస్ మెంట్ వారంటీ కూడా సంస్థ అందిస్తుంది.

నోకియా 2.3 స్మార్ట్ ఫోన్ ధరను రూ.8,199గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 27 నుంచి దేశవ్యాప్తంగా అన్ని షాపుల్లో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా రూ.249, రూ.349తో జియో రీచార్జ్ చేసుకునే వారికి రూ.7,200 విలువైన కూపన్లు అందించనుంది. ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్ గా ఉంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్,4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories