Health: నాయిస్‌ క్యాన్సిలేషన్‌ హెడ్‌ ఫోన్స్‌ వాడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..

Health
x

Health: నాయిస్‌ క్యాన్సిలేషన్‌ హెడ్‌ ఫోన్స్‌ వాడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..

Highlights

Health: ప్రస్తుతం నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్‌ల వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా యువత బయటి సౌండ్స్‌ వినిపించకుండా, మ్యూజిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Health: ప్రస్తుతం నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్‌ల వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా యువత బయటి సౌండ్స్‌ వినిపించకుండా, మ్యూజిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే సౌండ్ పరంగా మంచి అనుభూతిని అందించినా వీటి ద్వారా ఇబ్బందులు తప్పవని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఇలాంటి హెడ్‌ సెట్స్‌ ఉపయోగిస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) ఆధారంగా, ఈ హెడ్‌ఫోన్‌లు వినికిడి సామర్థ్యాన్ని మాత్రమే కాదు, మెదడు ధ్వని ప్రాసెసింగ్ విధానాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో అధికంగా హెడ్‌ఫోన్‌లు వినియోగించడం వల్ల ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ (APD) అనే సమస్య తలెత్తుతుంది. దీనివల్ల వ్యక్తి శబ్ధాలను ఫిల్టర్‌ చేయలేకపోతారు. ఫలితంగా ప్రతిస్పందన సమయం తగ్గుతుంది.

సాధారణంగా ఈ సమస్య చెవి ఇన్ఫెక్షన్ల వంటి వాటివల్ల వస్తుంది. అయితే నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్‌ల వాడకంతో కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రోజులు హెడ్స్ ఉపయోగించడం వల్ల మెదడు శబ్దాన్ని గమనించి, దానిని వేరు చేయడం మర్చిపోతుంది. తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు చెవి రిసెప్టర్లను తప్పుదోవ పట్టించవచ్చు. శబ్దం లేకపోవడంతో, మెదడు వినిపించే శబ్దాన్ని పెంచి, అసాధారణ ధ్వనులను సృష్టించవచ్చు.

వీటితోపాటు తలతిరగడం, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఏర్పడడం. ఆందోళన, భయం, చెవి నొప్పి, నిద్ర సమస్యలు, చెవిలో మోగుతున్న శబ్దం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే హెడ్‌ఫోన్‌ల వినియోగాన్ని పరిమితం చేయాలి. పెద్ద శబ్ద స్థాయిలో ఎక్కువ సమయం వినకుండా ఉండాలి. సహజ శబ్దాలతో కొంత సమయం గడపడం ద్వారా మెదడును శబ్దాన్ని ఫిల్టర్ చేయడంలో శక్తివంతంగా ఉంచాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories