ధూమపానం మానేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ధూమపానం మానేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
x
Highlights

ధూమపానం ఆరోగ్యంపై ఎంతటి చూపుతుంది అనేది సినిమా ముందు యాడ్‌లో చూస్తునే ఉన్నాం. అంతేకాదు దీనివల్ల అనారోగ్యం పాలై చావు చివరి అంచుల్లోకి వెళ్ళిన వాళ్ళను...

ధూమపానం ఆరోగ్యంపై ఎంతటి చూపుతుంది అనేది సినిమా ముందు యాడ్‌లో చూస్తునే ఉన్నాం. అంతేకాదు దీనివల్ల అనారోగ్యం పాలై చావు చివరి అంచుల్లోకి వెళ్ళిన వాళ్ళను కూడా చూశాం. అయినప్పటికీ పోగరాయళ్ళు దాన్ని తాగడం మాత్రం మానడం లేదు. సిగరెట్‌ తాగేవారికే కాకుండా వారి చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అయితే ధూమపానం మానేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధ్యయనం ప్రకారం 80% కంటే ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలకు ధూమపానం కారణమని తెలింది. సిగరెట్లలో 70కి పైగా హానికరమైన క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ దారితీసే ప్రమాదం ఉంది. కావున ధూమపానం ఎంతటి దుష్పాప్రభావాన్ని కలిగిస్తోందో

ఈ సర్వే తెల్చింది. పోగ వల్ల కఫం, దగ్గు ఎక్కువగా వస్తాయి. కావున పొగ మానేయడం వల్ల కొన్ని వారాల్లో దగ్గు, కఫం తగ్గుతుంది. దీంతో శ్వాస బాగా తీసుకోగలుగుతారు. అలాగే ధూమపానం మానడం వలన గుండెపోటు, గుండె సమస్యలు వంటివి కూడా తగ్గుతాయి. ఆక్సిజన్ తీసుకోవడం ఈజీ అవుతుంది, . ధూమపానం చేసేవారికి క్యాన్సర్, హృదయ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. పొగాకు ద్వారా వచ్చే హానికరమైన ప్రభావాలను నిరోధించేందుకు చికిత్స లేదు. ధూమపానం మానినప్పటికీ కూడా కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories