Night Shift Jobs: నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసేవాళ్లు ఇవి మర్చిపోవద్దు!

Night Shift Jobs
x

Night Shift Jobs: నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసేవాళ్లు ఇవి మర్చిపోవద్దు!

Highlights

Night Shift Jobs: ఈ తరహా జాబ్స్ చేసేవాళ్లు నిద్ర, ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

Night Shift Jobs: ఐటీతో పాటు కొన్ని ఇతర సెక్టార్స్‌లో కూడా ప్రస్తుతం నైట్ షిఫ్ట్ జాబ్స్ మామూలు అయిపోయాయి. ఈ తరహా జాబ్స్ చేసేవాళ్లు నిద్ర, ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు హెల్త్ ఎలా కాపాడుకోవాలంటే..

శరీరంలోని బయో క్లాక్‌కు విరుద్ధంగా రాత్రిళ్లు పనిచేస్తూ పగలు నిద్రపోయే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వయసు పైబడేకొద్దీ డయాబెటిస్, హార్మోనల్ ఇంబాలెన్స్‌తో పాటు రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

రాత్రిళ్లు పనిచేసేవాళ్లు ముందుగా ఆహారంపై ఓ కన్నేయాలి. రాత్రి సమయంలో తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్ లేకుండా చూసుకోవాలి. జీర్ణవ్యవస్థపై భారం పడకుండా లైట్ ఫుడ్‌కు పరిమితం అవ్వాలి. షిఫ్ట్‌కు వెళ్లేముందే రాత్రి భోజనం పూర్తి చేసి మధ్యలో పండ్ల వంటివి మాత్రమే తీసుకోవాలి. మళ్లీ ఉదయాన్నే మరో మీల్ తీసుకోవచ్చు. అలాగే రోజుకి మూడు నాలుగు లీటర్ల నీటిని తాగడం కూడా మర్చిపోవద్దు.

నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు నిద్రను సరిగా మ్యానేజ్ చేసుకోకపోతే ఒత్తిడి, ఒబెసిటీ, యాంగ్జైటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పగలు నిద్రపోయేందుకు ఒక నిర్ధిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా అదే టైంకి నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం మంచిది.

రాత్రిళ్లు పనిచేసేవాళ్లు వ్యాయామాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు. అయితే దీనివల్ల కూడా లాంగ్ టర్మ్ లో సమస్యలొస్తాయి. కాబట్టి నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు నిద్ర లేచిన తర్వాత కనీసం 30 నిమిషాలు వ్యాయమం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్లు రోజుకో రకమైన టైం టేబుల్ కాకుండా ఒకటే టైం టేబుల్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. తద్వారా శరీరం దానికి తగ్గట్టు బయో క్లాక్‌ను సరిచేసుకుంటుంది. అలాగే ఫ్యామిలీ, హాబీస్, ప్రయాణాల వంటివాటికి కూడా తగిన టైం కేటాయించుకుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories