ఇలా చేస్తే ఆస్తమాకు చెక్‌ పెట్టోచ్చు

ఇలా చేస్తే ఆస్తమాకు చెక్‌ పెట్టోచ్చు
x
Highlights

వాతావరణం కాస్తా చల్లబడితే చాలు శ్వాసకు సంబంధించిన వ్యాధులు తొందరగా అటాక్ అవుతాయి. ఆస్తమా లాంటి రోగులతో అల్లాడిపోతుంటారు. వాతావరణంలోని వచ్చిన చిన్నపాటి...

వాతావరణం కాస్తా చల్లబడితే చాలు శ్వాసకు సంబంధించిన వ్యాధులు తొందరగా అటాక్ అవుతాయి. ఆస్తమా లాంటి రోగులతో అల్లాడిపోతుంటారు. వాతావరణంలోని వచ్చిన చిన్నపాటి మార్పులను కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎలర్జీ కారణంగా, గాలిమార్గంలో అడ్డంకులు ఏర్పడి శ్వాసపరమైన ఈ ఇబ్బందులు కలుగుతాయి. శ్వాసకోశంలో వాపు రావడం, శ్వాసకోశ మార్గం ముసకపోవడం వల్ల ఆస్తమా సమస్య తలెత్తుతుంది. దీంతో పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఆస్తమా లాంటి శ్వాసకోస వ్యాధులు రావడానికి గల ముఖ్య కారణాలు.. చల్లగాలి, దుమ్ము, ధూళి, పొగ, ఎలర్జీ కారకాలు రసాయనాలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు. పలు పరీక్షల ద్వారా అస్తమా లక్షణాలను గుర్తించవచ్చు. వంశానుగత చరిత్ర, ఎలర్జీ, ఎగ్జిమాకు సంబంధించిన పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు, కఫం పరీక్ష, ఎక్స్‌రే పరీక్ష వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడతాయి.

పాటించవలస్సిన జాగ్రత్తలు

దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. కార్పెట్స్‌, బెడ్‌షీట్స్‌, బ్లాంకెట్స్‌లో డస్ట్‌మైట్స్‌ను నెలకు ఒకసారైనా ఎండలో వేయడం, శుభ్రంగా ఉతకడం చేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉన్న చోట డస్ట్‌మైట్స్‌ పెరుగుతాయి. ఇంట్లోని పరిసరాలు, బెడ్‌రూమ్‌ వస్తువులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖానికి మాస్క్‌ కట్టుకోవడం మంచిది. శరీర శ్రమ ఎక్కువైనా ఈ సమస్య తీవ్రమవుతుంది. ఆస్తమాను మెడిటేషన్‌, యోగా ద్వారా చాలా వరకు నివారించవచ్చు. హోమియో వైద్యంతో ఆస్తమా వ్యాధిని తగ్గించుకునే వీలుంది. ఆంటిమెనిమ్‌ ఆర్స్‌, ఆర్సెనిక్‌ ఆల్బ్‌, సాబుకస్‌, స్పాంజియా, నేట్రం సల్ఫ్‌, ఆరేలియా, కార్బోలేజ్‌ వంటి మందులు ఆస్తమాను నివారిస్తాయి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవు. వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటే ఆస్తమా త్వరగా తగ్గిపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories