Bitter Gourd Side Effects: కాకరకాయతో ఈ పదార్థాలు తింటున్నారా? అయితే మీ పని అయిపోయినట్టే..!

Bitter Gourd Side Effects: ఆరోగ్యానికి కాకరకాయ ఒక దివ్యౌషధం. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో దీనికి సాటిలేదు.

Naresh.k
Published on: 17 Feb 2026 4:52 PM IST
Bitter Gourd Side Effects: కాకరకాయతో ఈ  పదార్థాలు తింటున్నారా? అయితే మీ పని అయిపోయినట్టే..!
X

Bitter Gourd Side Effects: కాకరకాయతో ఈ పదార్థాలు తింటున్నారా? అయితే మీ పని అయిపోయినట్టే..!

ఆరోగ్యానికి కాకరకాయ ఒక దివ్యౌషధం. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో దీనికి సాటిలేదు. కానీ, ఈ 'చేదు' కూరతో కొన్ని పదార్థాలు కలిసినప్పుడు మన శరీరంలో ప్రతికూల రసాయనిక చర్యలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాలు

చాలామంది భోజనం ముగిసిన వెంటనే పాలు తాగుతుంటారు. ఒకవేళ మీ భోజనంలో కాకరకాయ ఉంటే, ఆ అలవాటును పక్కన పెట్టండి. కాకరకాయలోని చేదు తత్వం, పాలలో ఉండే ప్రోటీన్లతో కలిసి జీర్ణ ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, తీవ్రమైన గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉంది.

పెరుగు

అన్నంలో పెరుగు కలుపుకోవడం మన సంప్రదాయం. అయితే కాకరకాయ కూరతో పాటు పెరుగును తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత అలవాట్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండింటి కలయిక శరీరంలో వేడిని పెంచి, చర్మంపై దద్దుర్లు లేదా దురదకు దారితీయవచ్చు.

ముల్లంగి

ముల్లంగి మరియు కాకరకాయ రెండు విభిన్న స్వభావాలు కలిగిన కూరగాయలు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల గొంతులో కఫం పేరుకుపోవడం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇది మరింత ఇబ్బంది కలిగిస్తుంది.

మామిడి పండు

తీపి మామిడి, చేదు కాకరకాయ.. వినడానికి కాంబినేషన్ బాగున్నా, కడుపులోకి వెళ్తే మాత్రం యుద్ధమే! ఈ రెండింటిని కలిపి తింటే వికారం, వాంతులు మరియు యాసిడ్ రిఫ్లక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

తమలపాకు

భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడం అలవాటా? అయితే కాకరకాయ తిన్న రోజు మాత్రం దానికి దూరంగా ఉండండి. ఇది తీవ్రమైన శ్వాసకోస సమస్యలకు లేదా జీర్ణకోశ ఇబ్బందులకు దారితీయవచ్చు.ఆరోగ్యకరమైన ఆహారం మనల్ని శక్తివంతులుగా ఉంచుతుంది, కానీ తప్పుడు ఆహార కలయికలు అనారోగ్యానికి దారితీస్తాయి. కాకరకాయ తిన్నప్పుడు కనీసం 2 నుండి 3 గంటల విరామం తర్వాతే పాలు లేదా ఇతర పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.

Naresh.k

Naresh.k

Next Story