Top
logo

లక్ష తులాల బంగారపు కడ్డీలతో ఆ సింహాసనం.. అదీ ఆ పక్షి ప్రత్యేకత!

లక్ష తులాల బంగారపు కడ్డీలతో ఆ సింహాసనం.. అదీ ఆ పక్షి ప్రత్యేకత!
X
Highlights

భారత దేశ జాతీయ పక్షి నెమలి కున్న ప్రత్యేకత వేరు. అందమైన ఈ పక్షి ఈకలను చాలా మంది ఇళ్లలో ఉంచుకుంటారు. దీనివల్ల...

భారత దేశ జాతీయ పక్షి నెమలి కున్న ప్రత్యేకత వేరు. అందమైన ఈ పక్షి ఈకలను చాలా మంది ఇళ్లలో ఉంచుకుంటారు. దీనివల్ల అదృష్టం, శ్రేయస్సు వస్తుందని వారి నమ్మకం. గరుడ ఈక నుండి నెమలి పుట్టిందని హిందూ పురాణాల ప్రకారం చెబుతారు. రావణాసురుడితో ఇంద్రుడు యుద్ధం చేస్తున్న సమయంలో నెమలి తన ఈకలను తెరచి ఇంద్రుడుని రక్షించిందని చెబుతారు. ఇంద్రుడి తనని కాపాడినందుకు కృతజ్ఞతగా, నెమలికి తన ఈకలను ఎప్పుడు అంటే అప్పుడు మార్చుకునే వరాన్ని ఇచ్చాడట. అందుకే నెమలి సింహాసనం మీద కూర్చున్న ఇంద్రుని చిత్రాలను పురాణాల్లో కవులు వర్ణిస్తూ చెప్పారు.

నెమలి సింహాసనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 17 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ నెమలి సింహాసనం చెయించుకున్నాడని చెబుతారు. సామ్రాజ్యంలో ఉన్న వజ్రాలు, కెంపులు, పచ్చలు ముత్యాలు, లక్ష తులాల బంగారపు కడ్డీలతో నెమలి సింహాసనం చేయించాడట. ఆ సింహాసనంలో కూర్చున్నప్పుడు లోపల ఆనుకునేందుకు నవరత్నాల తాపడం చేసిన బంగారు పీటలు అమర్చారట. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అపురూపమైన నెమలి సింహాసనాన్ని మెుఘల్ చక్రవర్తి నుండి నాదిర్షా 1739లో ఇరాన్‌కు తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి పర్షియా సామ్రాజ్య ఆధిక్యతకు రాజచిహ్నంగా నెమలి సింహాసనం నిలిచిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు.

నెమలితో పాటు దాని సింహాసనానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. సంపదకు దేవతైన లక్ష్మిగా నెమలిని పూజిస్తారు. నెమలి ఈకను గాని, సింహాసనాన్ని గాని ఇంట్లో ఉంచుకొంటే సంపదతో పాటు శ్రేయస్సు లభిస్తుందని భావిస్తారు. వీటివల్ల ఇంటిలోకి కీటకాలు దరి చేరవని నమ్ముతారు. శ్రీకృష్ణుడు తన కిరీటంలో నెమలి పింఛాన్ని ధరించటం, శక్తికి మరొక రూపం అయిన కుమార స్వామికి నెమలే వాహనం కావటంతో హిందువులు భక్తితో పూజిస్తారు.

Next Story