Neem Leaves: వేప ఆకులు.. ఆరోగ్యానికి ప్రకృతి అందించిన వరం

Neem Leaves
x

Neem Leaves: వేప ఆకులు.. ఆరోగ్యానికి ప్రకృతి అందించిన వరం

Highlights

Neem Leaves: వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లు, చర్మ రుగ్మతలు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో మన ప్రాచీన ఆయుర్వేద చిట్కాలు చాలా ఉపయోగపడతాయి.

Neem Leaves: వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లు, చర్మ రుగ్మతలు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో మన ప్రాచీన ఆయుర్వేద చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా వేప చెట్టు, వేప ఆకులు, బెరడు, కాయలు ఇలా దాదాపు చెట్టు మొత్తం భాగం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

చర్మ సమస్యలకు వేప స్నానం

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి దురద, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. దీనికి సహజమైన పరిష్కారం వేప ఆకుల స్నానం. కొంతమంది వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా సూక్ష్మజీవులను కూడా తొలగించగలదు.

రక్తాన్ని శుద్ధి చేసే శక్తివంతమైన మూలిక

వేప ఆకుల్లో ఉండే సహజ రసాయనాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రోజూ కొద్దిగా వేప ఆకుల రసం తీసుకుంటే రక్తంలో ఉన్న టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మొటిమలు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

మధుమేహ నియంత్రణ

వేప ఆకుల్లో ఫైటోకెమికల్స్ ఉండటం వలన ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని సహజంగా మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగించవచ్చు. అయితే దీనిని వాడే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

జీర్ణ సంబంధిత సమస్యల నివారణ

వేప ఆకుల్లో యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వలన ఇవి కడుపు నులిపురుగులు, అజీర్తి వంటి సమస్యల నివారణకు సహాయపడతాయి. వేప ఆకుల కషాయం వాడటం వల్ల ఆకలి సమస్య కూడా తగ్గుతుంది.

వైరల్ జ్వరాలకు సహజ నివారణ

వేపలో ఉండే యాంటీవైరల్ లక్షణాలు వలన వైరల్ జ్వరాలు, ఫీవర్ వంటి సమస్యలను నివారించవచ్చు. వేప ఆకులను మరిగించి తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం

వేప ఆకుల్లోని యాంటీ మైక్రోబయల్ గుణాలు వలన వాతావరణ మార్పుల వల్ల కలిగే దగ్గు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్చు. చిన్నపాటి వేప కషాయం తాగడం వల్ల శ్వాస మార్గాలు శుభ్రంగా ఉంటాయి. ఇలా వేపను సాధారణంగా వాడటంవల్ల వర్షాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనం రక్షించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories