LifeStyle: మీ ఇళ్లు శుభ్రంగా ఉందా?.. లేదంటే ప్రమాదమే

LifeStyle: మీ ఇళ్లు శుభ్రంగా ఉందా?.. లేదంటే ప్రమాదమే
x
Highlights

గజిబిజి నగర జీవితం..ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కూడా లేదు... తినే తిండి దగ్గరి నుంచి నిద్రపోయే వరకు టైం సెన్స్ లేదు.

గజిబిజి నగర జీవితం..ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కూడా లేదు... తినే తిండి దగ్గరి నుంచి నిద్రపోయే వరకు టైం సెన్స్ లేదు.. ఇది నగరాల్లో నివసించే వారి జీవనశైలి అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. వీటి వల్ల నిత్యం అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరోకొత్త ఆరోగ్య సమస్య ముంచుకొస్తోంది.. అదేమిటంటే... మన ఒంటితో పాటు ఇంటిని శుభ్రంగా ఉంచాలట... లేదంటే...ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు శాస్త్రవేత్తలు.

అపరిశుభ్రంగా ఉండే ఇంట్లో దుమ్ము ధూళి చేరడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తాజా అధ్యనాలు చెబుతున్నాయి. దుమ్ము , ధూళిలో ఉండే బ్యాక్టీరియా, దాతోటి బ్యాక్టీరియాకు శక్తినిచ్చి అనారోగ్య సమస్యలు కలుగజేసే ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లోని దుమ్ములో నివసించే బ్యాక్టీరియా తనలోని జన్యువులను సమీప బ్యాక్టీరియాకు బదిలీ చేసి, యాంటీబయోటిక్స్‌ను అడ్డుకునే సామర్థ్యాన్ని పెంపొందేలా చేస్తుందని తద్వారా వ్యాధులు అధికంగా వ్యాపించే అవకాశముందని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారకు వచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పీఎల్‌వోఎస్‌ పాథొజెన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.

దుమ్ము , ధూళి కారణంగా శరీరంలో వ్యాధి నిరోధకతను అడ్డుకునే జన్యువులను బదిలీ చేస్తుందని అంటున్నారు నిపుణులు. దీని వల్ల ఈ బ్యాక్టీరియాకు యాంటీయమోటిక్స్‌ను అడ్డుకునే సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు. ప్రధానంగా ఇంట్లో ఉండే బట్టల్లో, టాయ్స్‌లో, మూలన పడేసి పేపర్లలోని దుమ్ము కారణంగా అలర్జీలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నాయి అధ్యయనాలు. అందుకే ఇంటిని వారానికి ఒకసారి కుదిరితే...రెండు సార్లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.ఇంటిని శుభ్రం చేసేప్పుడు పైపైన దులపకుండా.... పై నుంచి కింది వరకు ప్రతి దానికి నీట్ గా ఉంచాలి.

బెడ్‌షీట్‌లను వారానికి ఒకసారి మార్చడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అదే విధంగా కబోర్డులో ఉంచిన బట్టలను వీలైనన్ని సార్లు మార్చుతూ ఉండటం వల్ల దుమ్ము నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదే విధంగా బొమ్మలను నేలపైన పడేయకుండా వాటిని బాక్స్‌లలో కానీ బ్యాగుల్లో కానీ భద్రపరచాలని వీలైనన్ని సార్లు మార్చాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇన్ని చేసినా ఇంకా భయం ఉంటే ఎయిర్ ప్యూరిఫైర్లను వినియోగించడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. దీని వల్ల ప్రతి గది ఎంతో శుభ్రంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యం లభిస్తుంది.

తినే తిండి దగ్గరి నుంచి పీల్చే గాలి వరకు అన్నీ కలుషితమవుతువన్న తరుణంలో ఇంట్లో ఉన్నా అనారోగ్యం పొంచివుండటంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటిని అందంగా దుమ్ము ధూళీ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories