ఆకలిని నియంత్రించండి ఇలా

ఆకలిని నియంత్రించండి ఇలా
x
Highlights

మ‌న‌కు ఆక‌లి అయితేనే ఆహారం తింటాం..ఈ సంగ‌తి అందరికీ తెలిసిందే..ఆక‌లి బాగా ఎక్కువగా ఉంటే..కాస్త ఎక్కువగా తింటాము. కనీ కొంద‌రికి ఎప్పుడూ ఆక‌లి అవుతూనే...

మ‌న‌కు ఆక‌లి అయితేనే ఆహారం తింటాం..ఈ సంగ‌తి అందరికీ తెలిసిందే..ఆక‌లి బాగా ఎక్కువగా ఉంటే..కాస్త ఎక్కువగా తింటాము. కనీ కొంద‌రికి ఎప్పుడూ ఆక‌లి అవుతూనే ఉంటుంది. దీంతో వారు ఆహారాన్ని అధికంగా తీసుకుంటుంటారు. ఈ క్రమంలో వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది..ఈ నేపధ్యంలో కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఆకలిని కంట్రోల్ చేయవచ్చు. పైగా మనకు ఎన్నో విలువైన పోషకాలు కూడా అదుతాయి. మ‌రి ఆక‌లిని నియంత్రించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

* బీన్స్, ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు, తృణ ధాన్యాలను తిన‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. అలాగే ఎక్కువ స‌మ‌యం తినకున్నా.. ఆకలిగా ఉండదు. దీంతో అధికంగా ఆహారం తీసుకోవ‌డం మానేస్తారు.

* కోడిగుడ్లు, సోయా ఉత్పత్తులు, పెరుగు, ప‌ప్పు దినుసులు తదిత‌ర ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా ఆక‌లి నియంత్రణలో ఉంటుంది. . * అవ‌కాడో, ఆలివ్ ఆయిల్‌, కొబ్బరినూనెల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.

* భోజ‌నం చేసేముందు సూప్ తాగాలి. దీని వ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఫ‌లితంగా శ‌రీరంలో ఎక్కువ క్యాలరీలు చేర‌కుండా, కొవ్వు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు.

* భోజ‌నానికి ముందు అల్లం ర‌సం తాగ‌డం, డార్క్ చాక్లెట్ తిన‌డం లేదా కాఫీ తాగ‌డం, త‌క్కువ ఆహారాన్ని ఎక్కువ సేపు తిన‌డం చేసినా ఆక‌లి నియంత్రణ‌లో ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories