Moles: మచ్చ పోతుంది.. మీ చర్మంపై ఉండే మోల్స్‌ ఇలా సింపుల్‌గా తొలగించుకోవచ్చు తెలుసా?

Natural Remedies for Moles Removal Safe and Effective Home Tips for Clear Skin
x

Moles: మచ్చ పోతుంది.. మీ చర్మంపై ఉండే మోల్స్‌ ఇలా సింపుల్‌గా తొలగించుకోవచ్చు తెలుసా?

Highlights

Moles Natural Remedies: పుట్టుమచ్చలు మన శరీరంలో ఎక్కడైనా వస్తాయి. కొన్ని అందంగా కనిపిస్తే మరికొన్ని అబ్బా.. ఇక్కడ పుట్టుమచ్చ లేకుంటే బాగుండు అనిపిస్తుంది.

Moles Natural Remedies: పుట్టుమచ్చలు సహజసిద్ధంగా తొలగించుకునే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటితో అవి రానురాను తొలగిపోతాయి. ఈ ఇంటి చిట్కాలతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. అయితే, ఏ రెమిడీ ట్రై చేసినా మొదట సౌందర్య నిపుణులను సంప్రదించడం తప్పనిసరి.

వెల్లుల్లి పేస్ట్‌..

వెల్లుల్లిలో నేచురల్‌ ఎంజైమ్స్‌ఉంటాయి. ఇవి మచ్చల సెల్స్‌ను తొలగించే శక్తి కలిగి ఉంటుంది. అందుకే వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. మచ్చ ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ పెట్టి బ్యాండే్‌ వేయండి. కొన్ని గంటల తర్వాత వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మచ్చ తొలగిపోతుంది.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ (ACV)..

ఏవీసీలో కూడా ఎసిటిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది మచ్చలు ఏర్పడటానికి కారణమయ్యే టిష్యూలను విడగొడుతుంది. ఓ కాటన్‌ ముక్క తీసుకుని యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో ముంచి మచ్చ ఉన్న ప్రాంతంలో పెట్టి బ్యాండేజ్‌ వేయండి.

అరటి తొక్క..

అరటి పండు తొ్క తీసి లోపలి వైపు భాగాన్ని మచ్చ ఉన్ ప్రాంతంలో పెట్టండి. ఆపై బ్యాండేజ్‌ వేయండి రాత్రంతా అలాగే పెట్టి ఉదయం వాష్‌ చేసుకోండి. ఇది మచ్చ తొలగిపోయే వరకు ప్రతిరోజూ చేయండి.

కలబంద..

మచ్చ తొలగించడమే కాదు. కలబంద స్కిన్‌ రిపెయిర చేసే గుణాలు కూడా కలిగి ఉంటుంది. కలబంద గుజ్జు తీసుకుని మచ్చ ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. దాన్ని అలాగే రాత్రంతా పెట్టి ఉదయం కడగాలి.

ఉల్లిపాయం రసం..

ఉల్లిపాయ కట్ చేసి రసం తీయాలి. మచ్చ ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. ఓ అరగంట పాటు అలాగే ఉంచండి. ఇలా ప్రతరోజూ చేయండి.

టీ ట్రీ ఆయిల్‌...

టీ ట్రీ ఆయిల్‌లో కూడా యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి. కొద్దిగా నీళ్లలో టీ ట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపండి. దీన్ని కాటన్‌లో ముంచి మచ్చ ఉన్న ప్రాంతంలో ఓ అరగంటపాటు పెట్టండి.ఇలా రోజుకు రెండుసార్లు చేయండి.

ఎలాంటి ఉత్పత్తులు చర్మంపై ప్రయత్నించినా ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేయండి. ఏవైనా చర్మ సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories