Morning Walk: మార్నింగ్‌ వాక్‌ ఈ వ్యాధులకి దివ్యఔషధం..!

Morning Walk is the Cure for These Diseases
x

Morning Walk: మార్నింగ్‌ వాక్‌ ఈ వ్యాధులకి దివ్యఔషధం..!

Highlights

Morning Walk: నడక ఒక మంచి వ్యాయామం.

Morning Walk: నడక ఒక మంచి వ్యాయామం. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ 5000 అడుగులు నడవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు ఉదయాన్నే నిద్రలేచి నడవడానికి ఇష్టపడతారు. కానీ బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఈ పనికి దూరంగా ఉంటున్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఉదయం 20 నుంచి 30 నిమిషాలు నడవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1. స్టామినా పెరుగుతుంది

మీరు రోజూ అరగంట పాటు మార్నింగ్ వాక్ చేస్తే అది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ రకమైన శ్వాసక్రియతో మీ స్టామినా గణనీయంగా పెరుగుతుంది. తర్వాత మీరు మెట్లు ఎక్కడం, వేగంగా పరుగెత్తడం, భారీ వ్యాయామాలు చేయడం వంటి చాలా కష్టమైన పనులను చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

2. బరువు తగ్గుతారు..

ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. చాలా మంది శారీరక శ్రమను చేయడం లేదు. కాబట్టి పొట్ట, నడుము చుట్టు కొవ్ పేరుకుపోతుంది. దీన్ని నివారించడానికి మీరు ప్రతిరోజూ ఉదయం నడకకు సమయం కేటాయించాలి. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది అలాగే అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. గుండె జబ్బుల నివారణ

క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేసే వ్యక్తులకి గుండెపోటు, గుండె ఆగిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇది రక్తంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. దీంతో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories