నీళ్లు ఇచ్చే చెట్టు..

నీళ్లు ఇచ్చే చెట్టు..
x
Highlights

ఇదేమి విడ్డూరం.. చెట్టు ఎక్కడైనా నీళ్లు ఇస్తుందా.. అని ఆశ్చర్యపోకండి. నిజంగా నీళ్లు ఇచ్చే చెట్టు ఉంది. సాదరణంగా చెట్టుకు కాయలు కాస్తాయి.. పూలు...

ఇదేమి విడ్డూరం.. చెట్టు ఎక్కడైనా నీళ్లు ఇస్తుందా.. అని ఆశ్చర్యపోకండి. నిజంగా నీళ్లు ఇచ్చే చెట్టు ఉంది. సాదరణంగా చెట్టుకు కాయలు కాస్తాయి.. పూలు పూస్తాయి. అలా కాకుండా చెట్టు నుంచి గలగలా పారుతూ నీళ్లు ప్రవహిస్తే ఎలా ఉంటుంది. కొంచెం వింతగానే ఉంటుంది. బోరు గొట్టం నుంచి వాటర్ వచ్చినట్టు ఆ చెట్టు నుంచి నీరు ధారలుగా వస్తుంది. మరి ఇంతకీ ఈ చెట్టు ఎక్కడ ఉంది అనుకుంటున్నారా..! ఐరోపా ఖండంలో మోంటెనాగ్రో అనే దేశంలో ఉంది. అక్కడ డినోసా అనే చిన్న గ్రామంలో ఉందీ చెట్టు.

ఇది ఓ మల్బరీ వృక్షం. ఎన్నో ఏళ్లనాటిది ఆ చెట్టు. మోంటెనాగ్రోలోని డినోసా ప్రాంతంలో వర్షం కురిసి తగ్గగానే ఈ చెట్టు నుంచి ఫౌంటేన్‌లా నీరు పొంగి పొర్లుతుంది. చెట్టు నుంచి వచ్చే నీరు రావడంతో ఆ చుట్టుపక్కల అంతా మునిగిపోతుంది. బయటకొచ్చే నీరు చిన్న నీటి కాలువలా ఏర్పడి ప్రవహిస్తుండటం విశేషం. ఈ వింతను చూడటానికి ఆ చుట్టుపక్కల నుంచి జనం వచ్చేస్తుంటారు.

ఇంతకీ చెట్టుకు నుంచి నీరు రావడానికి కారణం.. ఆ చెట్టు కింద ఉన్న నీటి బుగ్గ. ఆ చుట్టు పక్కల కూడా చాల నీటి బుగ్గులు ఉన్నాయి. వర్షాలు పడితే భూగర్భంలో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో ఈ చుట్టుపక్కల బుగ్గల నుంచి నీరు ఉబికి పైకి వస్తుంటుంది. అలాగే ఈ చెట్టు కింద కూడా నీటి బుగ్గ ఉంది. పెద్ద కాండం ఉన్న ఈ చెట్టులో లోపలి నుంచి ఓ రంధ్రం ఉంది. భూగర్భంలో నీరు ఎక్కువైపోతే దానిలో ఒత్తిడి ఏర్పడి ఆ నీరు ఇలా ఫౌంటేన్‌లా మారి బయటకొచ్చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories