వర్షాకాలంలో డీహైడ్రేషన్‌.. ఇలా చేస్తే ఎప్పుడూ ఫ్రెష్‌గా హైడ్రేటెడ్‌గా ఉంటారు!

వర్షాకాలంలో డీహైడ్రేషన్‌.. ఇలా చేస్తే ఎప్పుడూ ఫ్రెష్‌గా హైడ్రేటెడ్‌గా ఉంటారు!
x

వర్షాకాలంలో డీహైడ్రేషన్‌.. ఇలా చేస్తే ఎప్పుడూ ఫ్రెష్‌గా హైడ్రేటెడ్‌గా ఉంటారు!

Highlights

వర్షాకాలం వచ్చేసరికి చల్లగా ఉండే వాతావరణం కారణంగా చాలామందికి దాహం తగ్గిపోతుంది. ఫలితంగా నీళ్లు తాగే అలవాటు తగ్గిపోతే డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ కాలంలోనూ సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. కొన్ని సులభమైన అలవాట్లతో డీహైడ్రేషన్‌ ను తప్పించుకోవచ్చు.

నీళ్లు, ఆహారంలో జాగ్రత్తలు

వర్షాకాలంలో దాహం తక్కువగా ఉన్నా రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లు – పుచ్చకాయ, దోసకాయ, నారింజ, టమాటా లాంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి తేమ అందించి డీహైడ్రేషన్‌ నుంచి రక్షిస్తాయి.

నీళ్లు తాగే అలవాటు

చల్లని వాతావరణం అని నీళ్లు మానేయకండి. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని కొద్దికొద్దిగా తాగుతూ ఉండటం అలవాటు చేసుకోవాలి.

హెల్తీ డ్రింక్స్

కేవలం నీళ్లు తాగడం బోర్ అనిపిస్తే అల్లం టీ, పుదీనా టీ లేదా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లు తీసుకోవచ్చు. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

దూరంగా పెట్టాల్సిన పానీయాలు

ఈ కాలంలో టీ, కాఫీ, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇవి శరీరంలో నీటిని తగ్గించి డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే వీటిని తగ్గించి, నీళ్లు, హెల్తీ డ్రింక్స్‌ పై ఎక్కువ దృష్టి పెట్టండి.

డీహైడ్రేషన్ లక్షణాలు

నోరు, పెదవులు పొడిబారడం, తలనొప్పి, మూత్రం గాఢరంగులోకి మారడం, తల తిరగడం లాంటి లక్షణాలు కనపడితే వెంటనే అప్రమత్తం కావాలి. ఇవి డీహైడ్రేషన్ సూచనలు కావచ్చు.

మొత్తానికి, వర్షాకాలంలోనూ సరిపడా నీళ్లు, పండ్లు, కూరగాయలు తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచితే డీహైడ్రేషన్‌ను సులభంగా నివారించవచ్చు.

(గమనిక: ఇక్కడ చెప్పిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలుంటే తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి.)

Show Full Article
Print Article
Next Story
More Stories