వర్షాకాలంలో బట్టలు ఫ్రెష్‌గా, వాసన లేకుండా ఉంచాలంటే ఇవే టిప్స్!

వర్షాకాలంలో బట్టలు ఫ్రెష్‌గా, వాసన లేకుండా ఉంచాలంటే ఇవే టిప్స్!
x

వర్షాకాలంలో బట్టలు ఫ్రెష్‌గా, వాసన లేకుండా ఉంచాలంటే ఇవే టిప్స్!

Highlights

వర్షాకాలం వచ్చిందంటే ఒక్క పక్క తీపి జ్ఞాపకాలు, మళ్లీ మరోవైపు – తడిగా ఉండే బట్టలు, వాటి నుంచి వచ్చే దుర్వాసన, బూజు, ఫంగస్ వంటి సమస్యలు వెంటనే గుర్తొస్తాయి.

Monsoon Clothes Care : వర్షాకాలం వచ్చిందంటే ఒక్క పక్క తీపి జ్ఞాపకాలు, మళ్లీ మరోవైపు – తడిగా ఉండే బట్టలు, వాటి నుంచి వచ్చే దుర్వాసన, బూజు, ఫంగస్ వంటి సమస్యలు వెంటనే గుర్తొస్తాయి. ఈ సీజన్‌లో బట్టలు ఆరడం కష్టమవ్వడం, తేమతో ఎక్కువసేపు ఉండటం వల్ల అవి త్వరగా చెరిగిపోవడం, వాసన రావడం లాంటి ఇబ్బందులు చాలా మందిని వెంటాడుతుంటాయి. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో వర్షాకాలంలో కూడా మీ బట్టలను శుభ్రంగా, తాజాగానూ ఉంచుకోవచ్చు.

ముందుగా, యాంటీ-బాక్టీరియల్ గుణాలు కలిగిన డిటర్జెంట్ వాడటం చాలా ముఖ్యం. వర్షాకాలపు తేమ వల్ల బట్టలపై బ్యాక్టీరియా, ఫంగస్ పుట్టే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కడిగేటప్పుడు డెటాల్ లేదా సావ్లోన్ వంటి క్రిమినాశకాలను తక్కువ మొత్తంలో జోడిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది బట్టలను క్లీన్‌గా ఉంచడమే కాకుండా, వాటిలో దుర్వాసనను కూడా నివారిస్తుంది.

తడి బట్టలు ఎక్కువసేపు అలా ఉంచకూడదు. వర్షం కురిసిన తర్వాత లేదా చెమటతో తడిచిన బట్టలను వెంటనే కడగాలి. ఈ అలవాటు వల్ల బట్టల్లో బూజు లేదా మరకలు ఏర్పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో బట్టలు కుప్పగా వేసి పెట్టకపోవడం చాలా ముఖ్యం.

బట్టలు ఆరబెట్టే విషయంలో జాగ్రత్తలు అవసరం. వర్షాకాలంలో వెలుపల ఆరబెట్టలేని పరిస్థితుల్లో, ఇంట్లో కిటికీల దగ్గర, ఫ్యాన్ కింద, లేదా డీహ్యూమిడిఫైయర్ సహాయంతో ఆరబెట్టాలి. ఇది బట్టల్లో తేమ తగ్గించి, వాటిని త్వరగా ఆరడంలో సహాయపడుతుంది. అలానే బట్టల నుంచి వాసన రావకుండా కూడా చేస్తుంది.

ఈ కాలంలో కాటన్ బ్లెండ్స్ లేదా సింథటిక్ ఫాబ్రిక్‌ల వంటి తేలికపాటి, త్వరగా ఆరే బట్టలను ఎంచుకోవడం మంచిది. మందమైన, మెత్తగా ఉండే ఫాబ్రిక్‌లు తేమను ఎక్కువగా ఇముడ్చుకోవడంతో ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది వాసనకు, ఫంగస్‌కు దారితీస్తుంది.

ఇక బట్టలు పూర్తిగా ఆరిన తర్వాత కూడా తేమ మిగిలే అవకాశం ఉన్నందున, వాటిని ఇస్త్రీ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా అండర్‌వేర్, సాక్స్‌లను హీట్ ఇస్త్రీ చేయడం వల్ల మిగిలిన తేమ నాశనం కావడమే కాకుండా, సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి.

మొత్తానికి, వర్షాకాలంలో బట్టల సంరక్షణ ఓ సవాలుగా కనిపించినా, ఈ సులభమైన చిట్కాలను పాటించితే అది సమస్యగా మారదు. బట్టలను ఫ్రెష్‌గా, శుభ్రంగా ఉంచడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈ వర్షాకాలంలో మీరు కూడా ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి – మీ దుస్తులు సుగంధంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories