Mobile Phone Side Effects on Skin: మొబైల్‌తో స్కిన్‌కు ఎఫెక్ట్! సేఫ్టీ టిప్స్ ఇలా..

Mobile Phone Side Effects on Skin: మొబైల్‌తో స్కిన్‌కు ఎఫెక్ట్! సేఫ్టీ టిప్స్ ఇలా..
x

Mobile Phone Side Effects on Skin: మొబైల్‌తో స్కిన్‌కు ఎఫెక్ట్! సేఫ్టీ టిప్స్ ఇలా..

Highlights

మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల కళ్లు మాత్రమే కాదు, చర్మం కూడా పాడవుతుందని మీకు తెలుసా? మొబైల్ వల్ల చర్మం పొడిబారడమే కాకుండా మొటిమలు కూడా వస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Mobile Phone Side Effects on Skin: మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల కళ్లు మాత్రమే కాదు, చర్మం కూడా పాడవుతుందని మీకు తెలుసా? మొబైల్ వల్ల చర్మం పొడిబారడమే కాకుండా మొటిమలు కూడా వస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మొబైల్ ఫోన్‌ను అదేపనిగా వాడడం వల్ల చర్మ సౌందర్యం పాడవుతుందని పలు స్టడీలు చెప్తున్నాయి. మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్‌తోపాటు మొబైల్ తయారీలో వాడే పలు మెటల్స్ వల్ల కూడా స్కిన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా మొబైల్స్ వల్ల ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయంటే..

మొబైల్ తయారీలో భాగంగా నికెల్‌, కోబాల్ట్‌ వంటి మెటల్స్ ఎక్కువగా వాడతారు. ఇవి ఎక్కువగా రేడియషన్‌ను ప్రసరిస్తాయి. ఎక్కువ సమయం పాటు మొబైల్‌ను శరీరానికి దగ్గరగా ఉంచుకోవడం ద్వారా స్కిన్ అలర్జీలతో పాటు చర్మం డల్ అవుతుంది.

టాయిలెట్ కమోడ్ కంటే పది రెట్లు ఎక్కువ క్రిములు మొబైల్ స్క్రీన్‌పై ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. మొబైల్ స్క్రీన్‌ను క్లీన్ చేయకుండా అలాగే ముఖానికి ఆనించి కాల్స్ మాట్లాడడం, మొబైల్ తాకిన చేతులతో ముఖాన్ని తడుముకోవడం వల్ల తెలియకుండానే ముఖంపై మొటిమలు పెరుగుతాయి. అలాగే మొబైల్ రేడియేషన్ వల్ల చర్మంలో కొల్లాజెన్ తగ్గి చర్మం వయసైపోయినట్టు కనిపిస్తుంది. ఇకపోతే మొబైల్ స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడడం వల్ల కళ్ల కింద వచ్చే వలయాల గురించి చెప్పనవసరం లేదు.

జాగ్రత్తలు ఇలా..

మొబైల్ వల్ల చర్మం పాడయ్యే అవకాశం టీనేజ్ వాళ్లకు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడం కోసం మొబైల్ వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఫోన్ వాడకం మానేయాలి. అలాగే నిద్రపోయేటప్పుడు మొబైల్‌ను దూరంగా పెట్టాలి.

మొబైల్ వాడకాన్ని తగ్గించి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మంపై పడే ఎఫెక్ట్‌ను తగ్గించొచ్చు. అలాగే మొబైల్ ఎక్కువగా వాడేవాళ్లు తరచూ మొబైల్ స్క్రీన్‌ను క్లీన్ చేస్తుండాలి. రోజుకి రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకుంటుండాలి.

మొబైల్ చూడటం వల్ల వచ్చే డార్క్ సర్కిల్స్‌ను పోగొట్టడం కోసం కళ్లపై ఐస్‌ప్యాక్ పెట్టుకోవచ్చు. అలాగే మొబైల్‌లో బ్లూలైట్ ఫిల్టర్‌ వాడటం, ఫాంట్ సైజ్ పెద్దదిగా పెట్టుకోవడం, తగినంత నిద్ర పోవడం వంటి జాగ్రత్తల ద్వారా కంటి కింది వలయాలు తగ్గుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories