Mineral Water: మీరు తాగే నీరు నిజంగా శుభ్రమైనదేనా..? అందులో అవసరమైన మినరల్స్ ఉన్నాయా..?

Mineral Water: మీరు తాగే నీరు నిజంగా శుభ్రమైనదేనా..? అందులో అవసరమైన మినరల్స్ ఉన్నాయా..?
x

Mineral Water: మీరు తాగే నీరు నిజంగా శుభ్రమైనదేనా..? అందులో అవసరమైన మినరల్స్ ఉన్నాయా..?

Highlights

నీరు మన ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే మీరు తాగే నీరు శుభ్రమైందా? అందులో శరీరానికి అవసరమైన మినరల్స్ ఉన్నాయా అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా?

నీరు మన ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే మీరు తాగే నీరు శుభ్రమైందా? అందులో శరీరానికి అవసరమైన మినరల్స్ ఉన్నాయా అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా?

కాలుష్యానికి గురైన నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు ఉండే అవకాశం ఉంది. అలాంటి నీటిని తాగితే విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు రావచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అందుకే శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగడం చాలా ముఖ్యం.

ఇక మినరల్ వాటర్ విషయానికి వస్తే, ఇది భూమి లోతుల నుంచి లేదా ఉపరితలంపై నుంచి లభించే సహజ నీరు. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సహజంగా ఉంటాయి. అయితే ఈ మినరల్స్ శరీరానికి అవసరమైన స్థాయిలో ఉన్నాయా లేదా అనే విషయం చాలా ముఖ్యం. మించిన మినరల్స్ ఉన్నా, తక్కువగా ఉన్నా ఆరోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఉంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం, మంచి మినరల్ వాటర్‌లో మినరల్స్ సమతుల్యంగా ఉండాలి. అలాగే బాటిల్‌ నీటిపై మినరల్స్ వివరాలు, టీడీఎస్ (TDS) స్థాయిలు స్పష్టంగా ఉండాలి. ఆ టీడీఎస్ లెవెల్ 500 mg/Lను మించకూడదు.

కాబట్టి మీరు ప్రతి రోజు తాగే నీరు నిజంగా మినరల్స్ కలిగి ఉన్నదా? BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? అన్నది ఇప్పుడే చెక్ చేయండి. ఆరోగ్యంగా ఉండాలంటే నీటి స్వచ్ఛతను నిర్లక్ష్యం చేయకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories