ఆ'పాత' మధురం చిరుధాన్యాలు..

ఆపాత మధురం చిరుధాన్యాలు..
x
Highlights

మన పూర్వీకులు ఆ కాలంలో తీసుకునే తిండే వేరు.. ఇప్పుడు మనంవ తీసుకునే తిండి వేరు..అంతా ఎరువుల తిండే దానితో రోగాలు కూడా అధికమవుతున్నాయి. దీంతో ప్రజల ఆహార...

మన పూర్వీకులు ఆ కాలంలో తీసుకునే తిండే వేరు.. ఇప్పుడు మనంవ తీసుకునే తిండి వేరు..అంతా ఎరువుల తిండే దానితో రోగాలు కూడా అధికమవుతున్నాయి. దీంతో ప్రజల ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి... ఆ పాత మంచి అంటున్నారు.. మన పెద్దలు ఒకప్పుడు తిన్న తిండినే ఇప్పుడూ మనమూ ఇష్టపడుతున్నాం.. చోడి జావ, జొన్న రొట్టె, సామలు, అరికెలు లాంటి చిరుధాన్యాలను ఇష్టపడుతున్నారు. ఈ మార్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ చిరు ధాన్యాలు తీనే ప్రయత్నం చేస్తున్నారు.

నేడు వ్యవసాయం ఆధునికంగా మారింది. ఒక్కప్పుడు క్రిమిసంహారక మందులు వాడకుండా బలవర్థకమైన చిరు ధాన్యాలను పండించేవారు. వాణిజ్య పంటల రూపంలో వాటి సాగు కాల క్రమేపీ కనుమరుగైంది. నేడు పంటలు పండించే వల్ల వివిధ రకాల రోగాలతో ప్రజలు సతమతమవుతున్నారు. లక్షలాది రూపాయల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. దీంతో అధిక పోషక విలువలు కలిగి ఉన్న చిరుధాన్యాలపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వీటి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. చిరు ధాన్యల సాగుతో ఆరోగ్య భారతాన్ని నిర్మించవచ్చు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories