Drink Milk: పాలు ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా..?

Milk is Better to Drink in the Morning or at Night
x

Drink Milk: పాలు ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా..?

Highlights

Drink Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే పాలలో చాలా పోషకాలు ఉంటాయి.

Drink Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే పాలలో చాలా పోషకాలు ఉంటాయి. పాలను అల్పాహారంలో చేర్చినట్లయితే ఇది అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పాలు ఎముకలను బలపరుస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, ప్రోటీన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోజంతా చురుకుగా ఉండటానికి మీకు సహాయపడతాయి. అయితే పాలు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

పాలు సంపూర్ణ ఆహారం. అందుకే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఉదయం పాలు తాగిన తరువాత పగటిపూట భారీగా అనిపించవచ్చు. చాలా మందికి కడుపు నొప్పి, అజీర్ణం కూడా రావొచ్చు. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే రాత్రంతా మీ కడుపు నిండి ఉంటుంది. మీకు ఆకలి అనిపించదు. కనుక మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. రాత్రిపూట వేడి పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది కండరాలను శాంత పరుస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం పాలు నిద్రను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటాయి. అంత తొందరగా జీర్ణం కావు. అందుకే ఇది ఉదయం తాగడానికి తగినవి కావు. శాస్త్రీయ పరిశోధన గురించి మాట్లాడితే పాలు తాగడం పూర్తిగా మీ ఆరోగ్యం, మీ జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఆవుపాలు మాత్రం కచ్చితంగా రాత్రిపూట మాత్రమే తాగాలి. ఇన్సులిన్ సమస్య ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే రాత్రిపూట పాలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు రాత్రి పూట పాలు తాగితే మీ ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories