40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ వ్యాధులతో ఇబ్బందే..! ఏంటంటే..?

Men Over the Age of 40 are more Likely To Get These Four Diseases | Men Health Tips
x

40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ వ్యాధులతో ఇబ్బందే..! ఏంటంటే..?

Highlights

Men Diseases: మగవారు 40 ఏళ్లు దాటారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి...

Men Diseases: మగవారు 40 ఏళ్లు దాటారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధునిక కాలంలో సమయ పాలన లేని ఆహారపు అలవాట్లు, ఉద్యోగాల వల్ల చాలా తొందరగా జబ్బు పడుతున్నారు. వీటికి తోడు అనారోగ్యపు అలవాట్లు ఎలాగూ ఉంటాయి. దీంతో తెలియకుండానే రోగాలకు గురవుతున్నారు. అందుకే ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. 40 ఏళ్లు దాటినవారు ముఖ్యంగా ఈ 4 వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యాధుల గురంచి ఓ లుక్కేద్దాం.

1. బీపీ, మధుమేహం

పెరుగుతున్న వయస్సుతో పురుషులలో బీపీ, మధుమేహం సర్వసాధారణం అయిపోయాయి. ఈ వ్యాధుల వల్ల శరీరంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం విపరీతంగా పెరిగింది. అయితే రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ ధూమపానం, మద్యం సేవించకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. దీంతో పాటు ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి రక్తంలో చక్కెర స్థాయిని పరిశీలించాలి.

2. మానసిక సమస్యలు

పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళనలు, పని ఒత్తిడి, ఇంటి గొడవల వల్ల మానసిక సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ వయస్సులో ఎవరైనా రాత్రిపూట నిద్రపోలేకపోతే ఒత్తిడికి లోనవుతారు. మరింత ఆందోళన లేదా మూడీగా ఉంటే అది మానసిక అనారోగ్యం ముఖ్య లక్షణం. మీరు ఈ లక్షణాలను కలిగి ఉంటే వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించాలి.

3. గుండె వ్యాధులు

40 ఏళ్ల తర్వాత గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాధి యువతలో కూడా ఎక్కువగా సంభవిస్తుంది. గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ వ్యాధి పెరుగుతోంది. దీనిని నివారించడానికి ఆహారంపై శ్రద్ధ వహించడం, శరీరంలోని కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అవసరం.

4. కండరాల సమస్యలు

వృద్ధాప్యంలో శరీరంలోని కండరాలు బలహీనపడతాయి. 40 ఏళ్లు దాటిన వారిలో కండరాలు 10 శాతం క్షీణిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీని కారణంగా ఎముకలు విరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా మందికి ఆర్థరైటిస్ సమస్య ఎదురవుతోంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు ఆరోగ్యంగా ఉండలేవని కాదు. క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కండరాలను పటిష్టంగా చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories