నిద్రించేముందు ఓ మామిడిపండు తినండి...

నిద్రించేముందు ఓ మామిడిపండు తినండి...
x
Highlights

పండ్లల్లో రారాజు మామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవి కాలంలో పుష్కలంగా లభించే మామిడిని తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. మామిడిలో...

పండ్లల్లో రారాజు మామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవి కాలంలో పుష్కలంగా లభించే మామిడిని తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. మామిడిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక దీర్ఘకాలక వ్యాధులను దూరం చేస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాల వృద్ధిని చెందకుండా అడ్డుకుంటాయి.

ఒబిసిటీ వున్న వారిలో చక్కెర స్థాయిల్ని కూడా మామిడి పండు అదుపు చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవాళ్లకి మామిడిలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎసిడిటీ, అజీర్తిలతో బాధపడేవాళ్లకి మామిడి ఔషధంగా పనిచేస్తుంది. మానసికంగా దృఢంగా ఉండెందుకు మామిడి బాగా తొడ్పడుతుంది. పండులోని ట్రిప్టోఫాన్‌ ఆనందాన్ని అందించే సెరటోనిన్‌ను విడుదల చేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. మామిడి పండులోని విటమిన్‌ ఎ, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటాయి. చర్మంపై ముడతలు తొలగిపోతాయి. మామిడిపండ్లు ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

మామిడిలోని పీచు వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది. అలాగే చర్మరంధ్రాలని తెరుచుకునేటట్టు చేస్తుంది. దాంతో చర్మం కాంతితో మెరిసిపోతుంది. అందుకే నిద్రించేముందు ఓ మామిడిపండు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories