Viral Video: ఉల్లిపాయ కట్ చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లున్నాడు.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..!

Man Cuts Onion at Lightning Speed Without Looking Viral Video
x

Viral Video: ఉల్లిపాయ కట్ చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లున్నాడు.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..!

Highlights

Viral Video: మనం ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఆ పనిని ఎంత పర్ఫెక్షన్‌తో చేస్తున్నాం, ఎంత డెడికేషన్‌తో చేస్తున్నామన్నదే ముఖ్యమని చెబుతుంటారు.

Man Cuts Onion at Lightning Speed

Viral Video: మనం ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఆ పనిని ఎంత పర్ఫెక్షన్‌తో చేస్తున్నాం, ఎంత డెడికేషన్‌తో చేస్తున్నామన్నదే ముఖ్యమని చెబుతుంటారు. ఇలా మనం చేసే పనిలో ఎక్సలెన్స్‌ సాధిస్తే అలాంటి వారికి తిరుగే ఉండదని అంటుంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఈ మాటలు అక్షర సత్యాలు అని చెప్పడంలో సందేహం లేదు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఉల్లిపాయలను కట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఓ కుర్రాడు. ఏంటి.. ఉల్లిపాయలను కట్‌ చేయడం కూడా గొప్పేనా, దానికే వైరల్‌ అవుతుందా అని అనుకుంటున్నారా.? అయితే ఈ కుర్రాడు ఉల్లిపాయను కట్‌ చేస్తున్న విధానం చూస్తుంటే మీరు కూడా వావ్‌ అనాల్సిందే. కనీసం ఉల్లిపాయ వైపు కన్నెత్తి కూడా చూడనే చూడకుండా అతి వేగంగా చాకుతో ఉల్లిపాయను రప్పారప్పా కట్‌ చేస్తున్నాడు.

చేతిని అతి వేగంగా కదిలిస్తూ సెకెన్ల వ్యవధిలో ఉల్లిపాయలను అతి చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్తున్నాడు. దీనంతటిని వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంకేముంది వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్‌ అవ్వడం మొదలు పెట్టింది. వీడియోలో కుర్రాడిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇతను మనిషి రూపంలో ఉన్న మెషిన్‌ అంటూ కొందరు స్పందిస్తుంటే మరికొందరు పొరపాటున ఇలా చేయడానికి ప్రయత్నిస్తే చేయి కట్‌ కావడం పక్కా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం ఈ కుర్రాడి ట్యాలెంట్‌పై మీరూ ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories