ఇది చూశారా.. మగవారికి గర్భ నిరోధక జెల్‌ వస్తుందట!

ఇది చూశారా.. మగవారికి గర్భ నిరోధక జెల్‌ వస్తుందట!
x
Highlights

పిల్లలు పుట్టకుండా.. పునరుత్పత్తికి అడ్డుకట్ట వేయడానికి గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించే వాళ్లు ఉన్నారు. అయితే ఈ గర్భ నిరోధక మాత్రలు ఇప్పటి వరకు మహిళలకు...

పిల్లలు పుట్టకుండా.. పునరుత్పత్తికి అడ్డుకట్ట వేయడానికి గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించే వాళ్లు ఉన్నారు. అయితే ఈ గర్భ నిరోధక మాత్రలు ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఉండేవి. కొందరూ మగవారతై కండోమ్‌లు వంటివి ఉపయోగించి పిల్లలు పుట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పురుషుల కోసం కూడా గర్భ నిరోధక ఔషధం రానుంది. అవును మరో రెండేళ్లలో ఈ జెల్ మార్కెట్లోకి రానుంది. ఈ గర్భనిరోధక ఔషదాన్ని మాంచెస్టర్‌ యూనివర్సిటీ, ఎడిన్‌ బర్గ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా తయారు చేశారు.

అయితే ప్రస్తుతం పరీశీలనలో ఉన్న ఈ ఔషధం మరో రెండేళ్లలో వినియోగంలోకి రానునట్లు పరిశోధకులు తెలిపారు. 'ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. జెల్ లా కనిపించే నెస్టోరోన్ అనే హార్మోన్ వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తిని నిలిపివేస్తుందట. దీన్ని వాడటం ప్రారంభించిన తర్వాత 6-12 వారాల్లో సెమెన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. వినియోగించడం నిలిపి వేసిన తర్వాత 6-12 వారాల్లో శుక్ర కణాలు ఎప్పటిలాగే తయారవుతాయి. ఈ ఔషధం ప్రభావం వల్ల ఈ ట్యూబ్యూల్స్ కు ఎటువంటి హాని జరగదట. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ కు చెందిన 450 మంది పురుషులపై ఈ జెల్‌ను ప్రయోగించినట్లు తెలిపారు పరిశోధకులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories