వేస‌వి తాపానికి రాగి అంబ‌లి

వేస‌వి తాపానికి రాగి అంబ‌లి
x
Highlights

చిరు ధాన్యాల్లో రాగులు చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరానికి ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి . రాగి సంగటి తినడం లేదా రాగి...

చిరు ధాన్యాల్లో రాగులు చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరానికి ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి . రాగి సంగటి తినడం లేదా రాగి అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అలాగే రాగితో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిది.. చిరు ధాన్యాలలో రారాజైన రాగుల్లో పోష‌క ప‌దార్థాలు అనేకం. .ఇనుము, క్యాల్షియం ఖనిజ లవణాలను రాగులు కలిగి ఉంటాయి. క్యాల్షియం ఎముకల పటుత్వానికి ఉపయోగపడుతుంది. రాగుల‌తో త‌యారు చేసే అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల అరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్ర‌ధానంగా బ‌రువు త‌గ్గడంతొ పాటు మరి ఎన్నో లాభాలే ఉన్నాయి.

అయితే రాగి అంబ‌లిని ఎలా తయారు చేయాలో, దాంతో మ‌న‌కు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లిలో ఉంటాయి. రాగి చలువ కావున వేడి చేపేవారికి ఇది ఉత్తమమైన ఆహారం. శరీరంలో ఉండే అధిక వేడిని త‌గ్గించుకోవ‌చ్చు. ఒక గ్లాస్ రాగి అంబ‌లి తాగినా చాలా సేపు ఆక‌లి వేయదు. అధిక ఆకలి ఉన్నవారు దీన్ని తీసుకోవడం మంచిది. దీంతో క‌డుపు నిండిన భావ‌న కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు కావున దీనిని బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. స్థూలాకాయంతో బాధపడుతున్నవారు రాగి అంబలి తాగితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

తయారు చేయు విధానం: ఒక గిన్నెలో అర లీటరు నీటిని తీసుకుని మరిగించాలి. అలోపు ఒక కప్పు నీళ్లలో అర కప్పు రాగి పిండిని లూజ్‌గా కలుపుని మరిగే నీటిలో పోసి బాగా కలుపాలి. 7 నిమిషాలు పాటు బాగా ఉడికించాలి. ఉడుకుతున్నంత సేపు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. తరువాత కిందకు దింపి పూర్తిగా చల్లార్చి తాగాలి. కావలంటే రుచి కోసం మజ్జిగా కలుపుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories