Makhana: వీళ్లు పొరపాటున కూడా తినకూడదు!

Makhana: వీళ్లు పొరపాటున కూడా తినకూడదు!
x

Makhana: వీళ్లు పొరపాటున కూడా తినకూడదు!

Highlights

మాఖానా (తామర గింజలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండటంతో గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

మాఖానా (తామర గింజలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండటంతో గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాఖానా తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు

మాఖానాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు మంచిదే కానీ, కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉన్నవారికి సమస్యగా మారవచ్చు. మాఖానా తినడం వల్ల రాళ్ల పెరుగుదల వేగం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.

2. జీర్ణ సమస్యలు

మాఖానాలోని అధిక ఫైబర్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అయితే, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారికి కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు పెరగవచ్చు.

3. అలెర్జీలు

కొంతమందికి మాఖానా వల్ల అరుదుగా అలెర్జీలు రావచ్చు. తిన్న తర్వాత శరీరంలో దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపాలి.

4. తక్కువ రక్తపోటు ఉన్నవారు

మాఖానా రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఇప్పటికే తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు అధికంగా తింటే తల తిరగడం, బలహీనత వంటి సమస్యలు రావచ్చు.

5. మధుమేహం ఉన్నవారు

మాఖానా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ, దాన్ని వేయించి ఉప్పు లేదా నూనె ఎక్కువగా వేసి తింటే మధుమేహులకు హానికరమవుతుంది. కాబట్టి పరిమితంగా, ఎటువంటి అదనపు కొవ్వు లేదా ఉప్పు లేకుండా తీసుకోవాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories