కొత్తగా కనిపించాలంటే!

కొత్తగా కనిపించాలంటే!
x
Highlights

మార్కెట్‌లో ఉండే ప్రతి ఫ్యాషన్‌ను అనుకరించాలంటే సమయం, డబ్బు...రెండూ అవసరమే. కావున తక్కువ బడ్జెట్‌లో ఉండే ట్రెండ్స్‌ను ఫాలో అవడం మంచిది...

మార్కెట్‌లో ఉండే ప్రతి ఫ్యాషన్‌ను అనుకరించాలంటే సమయం, డబ్బు...రెండూ అవసరమే. కావున తక్కువ బడ్జెట్‌లో ఉండే ట్రెండ్స్‌ను ఫాలో అవడం మంచిది అవేంటంటే.....

నలుపు, తెలుపు రంగుల్లో ఉండే ట్రేండ్స్ ఎలాంటి ఔట్‌ఫిట్‌తో అయినా మ్యాచ్‌ అవుతాయి. కాబట్టి ఈ రెండు రంగుల్లో ఉండే టాప్స్‌, బాటమ్స్‌ కొనుకోవాలి . ఈ రెండింటినీ కలర్‌ఫుల్‌ డ్రస్సులతో మార్చి మార్చి వెసుకోవచ్చు. పర్‌ఫెక్షన్‌ ఉండాలని.. మరింతగా పర్‌ఫెక్ట్‌గా తయారవ్వాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. ఈ ప్రయత్నంలో అంతిమంగా కొంత ఎబ్బెట్టుగా కనిపించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఫ్యాషన్‌ ట్రెండ్‌ సెటర్స్‌ అంతా పర్‌ఫెక్ట్‌ ఏమి ఉండారు. వారి ఔట్‌ఫిట్‌లో ఏదో ఓ చిన్న లోపంతో అందరినీ ఆకర్షిస్తారు. కాబట్టి కొద్దిగా అటు, ఇటుగా పొరపాట్లు దొర్లితేనే అందంగా కనిపించవచ్చు. మెరిసే దుస్తులు సెక్స్‌ అప్పీరెన్స్ తెచ్చి పెడతాయి. కావున ఇలాంటి డ్రస్‌లు వార్డ్‌రోబ్‌లో ఉండేలా చూసుకోవాలి. ఈవినింగ్‌ జరిగే పార్టీలకు ఇలాంటి దుస్తులు వేసుకోవడం వల్ల గుడ్ లుకింగ్ మీకు గుడ్ లుకింగ్ వస్తుంది. యువతులు బయటకు వెళ్ళేటప్పుడు బెల్ట్‌, స్కార్ఫ్‌ ఎక్కువగా ధరిస్తారు. పాత దుస్తులకు కొత్త లుక్‌ తెప్పించడంలో కలర్‌ఫుల్‌ స్కార్ఫ్‌ లేదా, ట్రెండీ బెల్ట్‌ మ కీలక పాత్ర పోషిస్తాయి. క్లాసిక్‌ లుక్‌లో కనిపించాలంటే బెల్ట్‌, షూస్‌...ఇవి రెండూ మ్యాచ్‌ అయ్యేలా చూసుకుంటే చాలు. ఎలాంటి డ్రస్‌ వేసుకున్నా క్లాసీ లుక్‌ మీరు అదిరిపోతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories