Liver Damage Warning Signs: మగతగా ఉంటుందా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.. వెంటనే అలెర్ట్ అవ్వండి!

Liver Damage Warning Signs
x

Liver Damage Warning Signs: మగతగా ఉంటుందా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.. వెంటనే అలెర్ట్ అవ్వండి!

Highlights

Liver Damage Warning Signs: మీ కాలేయం ప్రమాదంలో ఉందా? పాదాల వాపు, నిద్రలేమి, చర్మంపై దురద వంటి 5 ముఖ్యమైన లక్షణాలను గుర్తించండి. లివర్ సిర్రోసిస్ బారిన పడకుండా ఉండాలంటే వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

Liver Damage Warning Signs: ఆరోగ్యంగా ఉన్నంత కాలం కాలేయం గురించి మనం పెద్దగా పట్టించుకోము. కానీ అది 70-80 శాతం దెబ్బతినే వరకు బయటపడదు. అందుకే కాలేయం ఇచ్చే చిన్ని చిన్ని సంకేతాలను కూడా గమనించడం ముఖ్యం. మీ కాలేయం షెడ్డుకు వెళ్తోందని చెప్పే 5 ప్రధాన హెచ్చరికలు ఇవే:

1. రాత్రిపూట విపరీతమైన దురద: సాధారణ చర్మ అలర్జీ అని అనుకోవద్దు. ముఖ్యంగా రాత్రి సమయంలో మీ అరచేతులు, అరికాళ్లలో దురద ఎక్కువగా ఉంటే అది కాలేయ సమస్యకు సంకేతం. కాలేయం పిత్తాన్ని (Bile) సరిగ్గా ప్రాసెస్ చేయలేనప్పుడు, అది రక్తంలో చేరి చర్మం కింద దురదను కలిగిస్తుంది.

2. పాదాలు, చీలమండల వాపు: పాదాల వద్ద వాపు ఉండి, వేలితో నొక్కితే అక్కడ గుంటలాగా పడుతుంటే జాగ్రత్త పడాలి. కాలేయం దెబ్బతిన్నప్పుడు 'అల్బుమిన్' అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల కణజాలాల్లో ద్రవాలు పేరుకుపోయి పాదాలు ఉబ్బుతాయి.

3. విసర్జన రంగులో మార్పు: మీ మూత్రం ముదురు పసుపు లేదా నారింజ రంగులో వస్తున్నా.. మలం బంకమట్టి రంగులోకి మారినా మీ కాలేయం తీవ్ర ఒత్తిడిలో ఉందని అర్థం. శరీరంలో బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల ఇలా జరుగుతుంది.

4. తగ్గని అలసట మరియు వికారం: రాత్రంతా హాయిగా నిద్రపోయినా, ఉదయం లేవగానే మగతగా, వికారంగా అనిపిస్తుంటే అది లివర్ సమస్య కావచ్చు. రక్తంలోని విషతుల్యాలను కాలేయం వడపోయలేనప్పుడు మెదడుపై ప్రభావం పడి తీవ్రమైన అలసట కలుగుతుంది.

5. నిద్ర చక్రంలో మార్పులు: రాత్రిపూట నిద్ర రాకపోవడం, పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం (మగత) వంటి నిద్రలేమి సమస్యలు కాలేయ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కాలేయం విషపదార్థాలను శుద్ధి చేయలేనప్పుడు అవి మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి.

నివారణ మార్గాలు - మీరు చేయాల్సింది ఇదే:

LFT పరీక్ష: పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా రెండు మీకు కనిపిస్తే వెంటనే Liver Function Test (LFT) చేయించుకోండి.

ఆహారం: పీచు పదార్థాలు (Fiber) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. నూనె పదార్థాలను తగ్గించండి.

మద్యపానం: లివర్ సమస్యలకు ప్రధాన శత్రువు మద్యం. దీనికి దూరంగా ఉండటం అత్యవసరం.

వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం కాలేయంపై కొవ్వు పేరుకుపోకుండా (Fatty Liver) కాపాడుతుంది.

గుర్తుంచుకోండి.. కాలేయానికి తనను తాను బాగు చేసుకునే (Regeneration) శక్తి ఉంది. అయితే అది మనం ప్రారంభ దశలో గుర్తించి తగిన చికిత్స తీసుకున్నప్పుడే సాధ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories