నిమ్మతొక్కలతో ఎన్ని ఉపయోగాలో...

నిమ్మతొక్కలతో ఎన్ని ఉపయోగాలో...
x
Highlights

నిమ్మకాయల్లోని రసం తీయగానే వాటి తొక్కలను పడేస్తుంటాం. కానీ నిమ్మ తోక్కలతో చాలా ఉపయోగాలు ఉంటాయి. వాటిని ఇంట్లో ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అవి...

నిమ్మకాయల్లోని రసం తీయగానే వాటి తొక్కలను పడేస్తుంటాం. కానీ నిమ్మ తోక్కలతో చాలా ఉపయోగాలు ఉంటాయి. వాటిని ఇంట్లో ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అవి ఎలాంటి పనులకు ఉపయోగించు తెలుసుకుందాం..

బట్టలకు అంటుకున్న తుప్పు మరకలు పోవాలంటే వాటి మీద నిమ్మతొక్కలతో గాని ఉప్పు కలిపిన రసంతో కాని రుద్ది ఎండలో వేయాలి.

నిమ్మకాయ చెక్కలతో తలపై రుద్దకుని స్నానం చేస్తే చుండ్రుపోతుంది.

కత్తిపిడి, బొమ్మలు వంటివి పసుపు రంగుకి మారితే నిమ్మతొక్కలతో రుద్దాలి.

నిమ్మతొక్కలను నీటిలో కలుపుకుని స్నానం చేస్తే శరీరం కాంతివంతంగా ఉంటుంది. గజ్జి,తామర వంటి చర్మవ్యాధులు రావు.

- అడుగంటిన పాత్రల్లో నిమ్మతొక్కలని చిన్నచిన్న ముక్కలుగా చేసి.. వేసి నీరుపోసి మరిగించాలి. చల్లారాక శుభ్రంగా కడిగితే మరకలు పోతాయి.

- రాగి వస్తువులను నిమ్మచెక్కలతో శుభ్రపరచుకోవచ్చు. ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో వాటిని రుద్ది, నీటితో కడిగి తర్వాత పొడిబట్టలతో తుడవాలి.

- డైనింగ్‌ టేబుల్‌ను రసం తీసేసిన నిమ్మచెక్కలతో తుడిస్తే జిడ్డుపోయి నిటిగా ఉంటుంది.

- అరటికాయలు తరిగాక చేతులు జిగురుగా ఉంటాయి. అప్పుడు నిమ్మ తొక్కలతో చేతులు బాగా రుద్దుకుంటే సరిపోతుంది.

వాష్‌ బేసిన్‌ను రసం పిండేసిన నిమ్మతొక్కలతో రుద్దితే తెల్లగా ఉంటుంది.

బట్టలపై పడిన గోరింటాకు మరకలు పోవడానికి నిమ్మతొక్కలతో రుద్దాలి

గోళ్లను నిమ్మతొక్కలతో బాగా రుద్దితే,గోళ్లు అందంగా మారుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories