Laws For husbands: భార్య హింస.. భర్తను రక్షించే చట్టాలు ఇవే..!

Laws For husbands
x

Laws For husbands: భార్య హింస.. భర్తను రక్షించే చట్టాలు ఇవే..!

Highlights

Laws For husbands: గతంలో భర్తలు భార్యలను కొట్టడం, హింసించడం వంటి కేసులు చాలా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో భార్యలు తమ భర్తలను హింసించడం వంటి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Laws For husbands: గతంలో భర్తలు భార్యలను కొట్టడం, హింసించడం వంటి కేసులు చాలా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో భార్యలు తమ భర్తలను హింసించడం వంటి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భాలలో, భార్య వేధింపుల నుండి భర్తను రక్షించే చట్టాలు ఏవో తెలుసుకుందాం..

భారత రాజ్యాంగంలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి . ఈ చట్టాల భయం కారణంగా, చాలా మంది పురుషులు తమ భార్యలపై చేయి చేసుకునే ధైర్యం చేయరు. కానీ ఇటీవలి కాలంలో, భార్యలు తమ భర్తలను మానసికంగా వేధించడం, కొట్టడం వంటి కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొంతమంది మహిళలు స్వయంగా తమ భర్తలపై దాడులు చేస్తూ, తిరిగి తమ భర్తలపై, వారి కుటుంబాలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి, భార్య వేధింపుల నుండి అమాయక పురుషులను రక్షించడానికి ఏ చట్టాలు ఉన్నాయో తెలుసుకుందాం..

ఒక మహిళ తన భర్త, అత్తగారు లేదా కుటుంబం నుండి వేధింపులకు గురైతే 2005 గృహ హింస చట్టం ప్రకారం రక్షణ పొందవచ్చు. కానీ భర్తలకు అలాంటి చట్టం లేదు. అలాగే, అలాంటి కేసులు గృహ హింస కిందకు రావు. భార్య చేతిలో వేధింపులకు గురైన భర్తకు గృహ హింస చట్టం రక్షణ లేకపోయినా, అతను IPC లోని అనేక సెక్షన్ల కింద ఫిర్యాదు చేయవచ్చు. సెక్షన్ 323 - భార్య శారీరకంగా దాడి చేసి ఉంటే, సెక్షన్ 506 - నేరపూరిత బెదిరింపు, సెక్షన్ 504 - అవమానించడం లేదా మానసికంగా వేధించడం కోసం, ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు. భార్య తన భర్తను మానసికంగా లేదా శారీరకంగా హింసిస్తే లేదా తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరిస్తే, భర్త ఆమెపై సెక్షన్ 154 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. వరకట్న వేధింపుల తప్పుడు కేసులో తనను ఇరికిస్తానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే భర్త తన భార్యపై సెక్షన్ 498A కింద ఫిర్యాదు చేయవచ్చు.

భర్త పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవచ్చు లేదా నేరుగా మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. మానసిక వేధింపులు లేదా పరువు నష్టం కేసులలో, మానవ హక్కుల కమిషన్లు, పురుష హక్కుల సంస్థల నుండి కూడా సహాయం పొందవచ్చు. భార్య మానసికంగా లేదా శారీరకంగా హింసిస్తే లేదా పరిస్థితి మరింత దిగజారితే, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 కింద విడాకుల పిటిషన్ దాఖలు చేసి చట్టబద్ధంగా విడాకులు పొందవచ్చు. సమాజంలో పురుషులను 'బలవంతులు'గా పరిగణిస్తారు. కానీ నేడు, అదే పురుషులే తమ భార్యల చేతిలో ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories