ఏడాదిలో నెల మాత్రమే కనిపించే విలేజ్

ఏడాదిలో నెల మాత్రమే కనిపించే విలేజ్
x
Highlights

నెల రోజులే కనిపించే గ్రామం ఏంటా అని అనుకుంటున్నారా.. కొన్ని విషయాలు చదవాటానికి వింతగా ఉన్నా.. నిజంగా అవి కొన్ని సార్లు ఆశ్చర్యానికి కల్గిస్తాయి. ఈ...

నెల రోజులే కనిపించే గ్రామం ఏంటా అని అనుకుంటున్నారా.. కొన్ని విషయాలు చదవాటానికి వింతగా ఉన్నా.. నిజంగా అవి కొన్ని సార్లు ఆశ్చర్యానికి కల్గిస్తాయి. ఈ గ్రామం కూడా అలాగే సంవత్సరంలో 11 నెలలు నీట మునిగి ఉండి ఒక నెలమాత్రమే తేలుతుంది. గోవాలోని కుర్ది అనే గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. ఏడాదిలో ఒక్క నెల మాత్రమే సందర్మించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి.. ఆ ప్రదేశాన్ని చూడటానకి పర్యాటకులు ఎదురు చూస్తుంటారు.

కుర్ది గ్రామం సలౌలిం నది పరీవాహక ప్రాంతంలో ఉంది. గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో సలౌలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. కుర్ది ప్రాంతం ఒకప్పుడు మామూలుగానే ఉండేది. కాకపోతే 1986లో ఆ నదిపై ఆనకట్ట నిర్మించారు. దీంతో ఆ విలేజ్ మొత్తం నీట మునిగింది. ఇక్కడ మరో విచిత్రమేంటంటే ఏడాదిలో 11 నెలలు పాటు ఆ గ్రామం నీటిలోనే మునిగి ఉండటం. అయితే వేసవిలో మాత్రం తేలుతుంది. అక్కడ జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల ఆ సమయంలో గ్రామం ఆనవాళ్లు శిథిలాలు బయటకు కనబడుతాయి. అది కూడా నెల రోజులు మాత్రమే. నీరు పూర్తిగా ఇంకిపోయినప్పుడు మాత్రమే ఆ గ్రామం కనబడుతుంది.

ఇక వర్షాలు ప్రారంభమయ్యాయంటే మునిగే కుర్ది గ్రామం ఒక దశలో ఓ దీవిలా దర్శనమిస్తుంది. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ అందమైన దృశ్యాన్ని చూడడం కోసం పర్యాటకులు ప్రతి ఏటా అక్కడికి వెళ్లి ఎదురుచూడటం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories