కిడ్నీ సమస్యలను దూరం చేసే కొత్తిమీర కషాయం

కిడ్నీ సమస్యలను దూరం చేసే కొత్తిమీర కషాయం
x
Highlights

కషాయం అనగానే ఏదో కపాలానికి తాకినట్లే అనిపిస్తుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. తగిన ఔషధ కషాయం తాగాల్సిందేనని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. కొన్నిరకాల...

కషాయం అనగానే ఏదో కపాలానికి తాకినట్లే అనిపిస్తుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. తగిన ఔషధ కషాయం తాగాల్సిందేనని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. కొన్నిరకాల మూలికల్ని చూర్ణాలుగా చేస్తేనే మేలు. మరి కొన్నింటిని మాత్రం కషాయమే చేయాలి. ప్రయోజనాలు అనేవి మూలికల మూలకాల మీదే కాదు. కషాయాల తయారీ పైన కూడా ఆధారపడి ఉంటాయి. మూలికల ప్రత్యేకతలు, వివిధ ప్రయోజనాల ఆధారంగా కషాయాలు తయారు చేసుకోవాలి.

కొందరైతే చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఆయుర్వేదం ప్రకారం తయారుచేసే కొత్తిమీర కషాయం తాగితే మంచిదంటున్నారు నిపుణులు. మరి ఆ కషాయం ఎలా చేయాలో ఓసారి తెలుసుకుందాం… ముందుగా నీటిలో కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి. ఆపై చల్లార్చుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తాగాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు వాడి.. ఆపై 10 రోజులు మానేసి మళ్లీ తాగడం మొదలు పెట్టాలి. ఇలా చేయడం వలన పలురకాల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలకు ఎంతో దోహదం చేస్తుంది.కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినోబ్లాడర్ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్ లెవల్ పెరగడం, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే.. కొత్తిమీర కషాయం తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories