విటమిన్లు సమృద్దిగా కావాలంటే కొత్తిమీర రైస్

విటమిన్లు సమృద్దిగా కావాలంటే కొత్తిమీర రైస్
x
Highlights

కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు...

కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి.

కావలసిన పదార్థాలు:

పొడి అన్నం

కొత్తిమీర

అల్లం ముక్క

పచ్చిమిర్చి

ఉల్లిగడ్డ

ఇంగువ

జీడిపప్పులు

ఉప్పు

నూనె

తయారీ విధానం:

ముందుగా కొత్తిమీరను చిన్నగా తరుగుకోవాలి..ఆ తరువాత అల్లం ముక్క, పచ్చిమిర్చి , కొత్తిమీరను కలిపి కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె కాస్త కాగిన తరువాత ఇంగువ వేసుకోవాలి...ఆ తరువాత జీడిపప్పులు వేసుకోవాలి..ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమం కడాయిలో వేసుకోవాలి...ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చిన్నమంటపై ఉంచాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నం వేయాలి...కొత్తిమీర పేస్టు బాగా కలిసేలా అన్నాన్ని కలుపుకోవాలి.. వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories