Kiwi: గుండె ఆరోగ్యానికి.. కిడ్నీ పనితీరుకు ఈ ఒక్క పండు తినండి చాలు..!

Kiwi Health Benefits Boosts Immunity Heart Kidney and Weight Loss Naturally
x

Kiwi: గుండె ఆరోగ్యానికి.. కిడ్నీ పనితీరుకు ఈ ఒక్క పండు తినండి చాలు..!

Highlights

Kiwi Benefits: కీవీ పండులో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఇందులో విటమిన్‌ సీ కూడ అధికంగా ఉంటుంది.అయితే, ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు.

Kiwi Benefits: కీవీ పండు ఆకుపచ్చ రంగులో కనిపించే ఈ పండులో విటమిన్‌ సీ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. కీవీ పండులో శరీర ఆరోగ్యానికి సహాయపడే గుణాలు ఉంటాయి. ఈ పండు రెగ్యులర్‌గా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.

కీవీ పండు తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది కీవీ పండు ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి ప్రేరేపిస్తాయి. కీవీ పండులో విటమిన్‌ కే వల్ల ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

కీవీ బీపీని నియంత్రించే శక్తి కలిగి ఉంటుంది. ఇది డయాస్టోలిక్‌, సిస్టోలిక్‌ రక్తపోటులను నియంత్రిస్తుందట. కీవీలో లుటీన్‌, విటమిన్‌ సీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

కీవీ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్‌ సీ, ఇ ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. చర్మంపై వయస్సురీత్యా వచ్చే వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది. కీవీలో ఉండే విటమిన్స్‌ సన్‌ డ్యామేజ్‌ కాకుండా మన చర్మాన్ని కాపాడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్‌ కే నేచురల్‌గా నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది.

కీవీ పండును రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించేసత్ఆయి. అంతేకాదు రక్తాన్ని పలుచగా చేసి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

అంతేకాదు కొన్ని నివేదికల ప్రకారం రెగ్యులర్‌గా కీవీ పండు తిన్నవారిలో అస్తమా సమస్య కూడా తగ్గిపోయిందట. కీవీ పండులో విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును కూడా మెరుగు చేశాయని నివేదికలు చెబుతున్నాయి.

ప్రధానంగా ఇందులో గ్లైసెమిక్‌ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా ఇది డయాబెటీస్‌తో బాధపడుతున్నవారికి కూడా మంచిది. వారు రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల షుగర్‌ పెరగదు. నీటి శాతం ఇందులో అధికంగా ఉంటుంది. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు ఈ పండు తింటే ఫైబర్‌ కూడా అందుతుంది. కీవీ పండును సలాడ్‌, స్మూథీలా తయారు చేసుకుని తీసుకోవాలి. ఇందులో విటమిన్స్‌, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్‌, ఫైబర్‌ ఉంటాయి. ఇవన్నీ మన శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories