చిన్ని ప్రశంస..అభినందనమైన చిరునవ్వు..అంతకంటే ఇంకేం కావాలి

చిన్ని ప్రశంస..అభినందనమైన చిరునవ్వు..అంతకంటే ఇంకేం కావాలి
x
Highlights

విమర్శ చాలా సులువు..ప్రశంస చాలా అరుదు. ఈర్ష్య,ద్వేశాలతో కూడిన నేటి సమాజంలో ప్రశంసలు చాలా అరుదుగా మారిపోయాయి. చిన్ని ప్రశంస.. అభినందనపూర్వకమైన...

విమర్శ చాలా సులువు..ప్రశంస చాలా అరుదు. ఈర్ష్య,ద్వేశాలతో కూడిన నేటి సమాజంలో ప్రశంసలు చాలా అరుదుగా మారిపోయాయి. చిన్ని ప్రశంస.. అభినందనపూర్వకమైన చిరునవ్వు..మనిషి అంతకంటే కావల్సింది ఏమి ఉంటుంది. ఇప్పుడు మనిషి అలాంటి స్పందనలు కూడా మరిచిపోయాడు. ఇతరులు తమను ప్రశంసించాలని, మెచ్చుకుంటే ఆనందించాలనీ కోరుకుంటారు. ఇది తప్పేమీ కాదు. వారు చేసిన మంచిపని మెచ్చుకోవడం వల్ల వారిలో మరలా ఆ పనిని చేసేలా ఆ ప్రశంస ప్రోత్సాహిస్తుంది.

ముఖ్యంగా పిల్లలని అభినందిస్తూ, భుజం తట్టాలి..పిల్లలు చిన్న చిన్న ప్రశంసలకే పొంగిపోతారు. ఇదే వారిలో పదేపదే ప్రశంసలు పొందాలనే భావనను కలిగిస్తుంది. కావున పిల్లలు చేసిన ప్రతి మంచి పనినీ తల్లిదండ్రులు అభినందించాలి. దీంతో పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకుంటారు. ఈ అభినందన పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీస్తుంది.

ప్రయత్నంలో గెలిచినా, ఓడినా అభినందనలే వారిని మరో ప్రయత్నానికీ ప్రేరేపిస్తుంది. అభినందించే పద్ధతి ఒకొక్కరిలో ఒకలా ఉంటుంది. ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం.. భుజం తట్టడం వంటివి అభినందకు సూచికలు. అభినందన అనేది ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. అది భుజం తట్టి ప్రోత్సహించేలా, మరిన్ని విజయాలు సాధించేలా ఉండాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories