Kidney Cleanse: ఈ 5 ఆరోగ్యకరమైన ఆహారాలు మీ కిడ్నీలను క్లీన్ చేసేస్తాయి..!

Kidney Cleanse 5 Healthy Foods to Detoxify Your Kidneys Naturally
x

Kidney Cleanse: ఈ 5 ఆరోగ్యకరమైన ఆహారాలు మీ కిడ్నీలను క్లీన్ చేసేస్తాయి..!

Highlights

Kidney Cleansing Foods: కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటేనే శరీరారోగ్యం బాగుంటుంది. బ్యాడ్‌ లైఫ్ స్టైల్, మద్యం ఇతర అలవాట్ల వల్ల కిడ్నీలు పాడవుతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీలు క్లీన్ అవుతాయి.

Kidney Cleansing Foods: ప్రధానంగా బ్యాడ్ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఎక్సర్సైజ్ వంటివి చేయకపోవడం, దీర్ఘకాలిక రోగాల వల్ల కిడ్నీలు ప్రమాదాల బారిన పాడతాయి. తద్వారా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల కిడ్నీలు క్లీన్ అయిపోతాయి.

యాపిల్స్..

ప్రతి ఒక్కరోజు ఒక యాపిల్ తినాలి. రోగాలకు దూరంగా ఉండాలని ఉంటారని ఆరోగ్య నిపుణులు ఎప్పటినుంచో చెప్తుంటారు.. ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది కిడ్నీల పనితీరును మెరుగు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయి, కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది.

క్రాన్ బెర్రీస్..

క్రాన్ బెర్రీ ఆరోగ్యకరమైన బెర్రీ జాతికి చెందిన పండ్లు. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల(UTI) బారి నుంచి బయటపడతారు. అంతేకాదు ఇందులో ఉండే కొన్ని సహజ గుణాలు కిడ్నీ ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి. తద్వారా మిషన్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదు క్రాన్ బెర్రీలు మహిళలకు వరం వంటివి వారి డైట్లో కచ్చితంగా ఉండాల్సిందే

రెడ్ క్యాప్సికం..

రెడ్ క్యాప్సికం తరచుగా తింటే ఆరోగ్య ప్రయోజనాలు మెండు ఇందులో విటమిన్ బీ6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఉంటుంది. కిడ్నీలో పనితీరును మెరుగు చేస్తాయి. ఇందులోని ఫోలిక్‌ యాసిడ్ ఎనీమియా సమస్యను దూరం చేస్తుంది.

క్యాలీఫ్లవర్..

క్యాలీఫ్లవర్ లో కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది.. కిడ్నీ ఆరోగ్యకరమైన పని తీరుకు ప్రేరేపిస్తుంది. క్యాలీఫ్లవర్ తో కూరలు తయారు చేసుకోవచ్చు. దీంతో సూప్ కూడా తయారు చేస్తారు. ఇది మొత్తానికి కిడ్నీ క్లెన్స్‌ చేసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది

వెల్లుల్లి..

ప్రధానంగా ఇందులో అల్లిసిన్ ఉంటుంది. వెల్లుల్లి కూరలో వినియోగిస్తాం. ఇది కూడా కిడ్నీని రక్షించే గుణం కలిగి ఉంటుంది.. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలు చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇవి కాకుండా కొన్ని రకాల కొవ్వు చేపలు డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా కిడ్నీ క్లెన్స్ అవుతుంది. ఇవి ఖనిజాలను గ్రహించేలా చేసి ఆరోగ్యకరమైన కిడ్నీలకు ప్రేరేపిస్తాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories