Kasuri Meth: కస్తూరి మెంతితో ఇన్ని లాభాలున్నాయా.? అస్సలు ఊహించలేరు..!

Kasuri Meth: కస్తూరి మెంతితో ఇన్ని లాభాలున్నాయా.? అస్సలు ఊహించలేరు..!
x
Highlights

Kasuri Methi Benefits: మెంతులను మాత్రమే కాదు, మెంతి ఆకులను కూడా మనం ఆహారంలో ఉపయోగిస్తాం.

Kasuri Methi Benefits: మెంతులను మాత్రమే కాదు, మెంతి ఆకులను కూడా మనం ఆహారంలో ఉపయోగిస్తాం. మెంతి ఆకులతో కూర, పప్పు, చారు వంటి వంటలను తయారు చేస్తారు. ఉత్తర భారతదేశంలో మెంతి ఆకులను ఎండబెట్టి కసూరి మేథీ తయారు చేస్తారు. ఈ ఎండిన ఆకులు వంటలకు ప్రత్యేక రుచిని అందిస్తాయి. అయితే కేవలం వంటకు రుచిని మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా కస్తూరి మెథీ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కస్తూరి మెంతిని తీసుకోవడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఫైబర్ అధికంగా ఉండే కసూరి మేథీ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. శరీరంలో వాపులను తగ్గించే గుణాల కారణంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు దీన్ని ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసుకోవచ్చు.

* బరువు తగ్గాలనుకునే వారు కస్తూరి మెంతిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ ఆకలిని నియంత్రించడంతో పాటు, ఎక్కువకాలం కడుపునిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఇది బరువు తగ్గించడంలో పరోక్షంగా ఉపయోగపడుతుంది.

* కసూరి మేథీలో క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం శరీరానికి అవసరమైన క్యాల్షియంను సమర్థంగా గ్రహించేందుకు సహాయపడుతుంది.

* కసూరి మేథీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ సమస్యలు తగ్గించి, సహజసిద్ధమైన అందాన్ని కాపాడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories