కడక్‌నాథ్ చికెన్ పాట్ బిర్యానీ...

కడక్‌నాథ్ చికెన్ పాట్ బిర్యానీ...
x
Highlights

కడక్‌నాథ్‌ కోడిలో కొలెస్ట్రాల్‌ శాతం చాలా తక్కువ, పైగా దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్‌, విటమిన్లు ,కాల్షి యం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ నికోటినిక్‌...

కడక్‌నాథ్‌ కోడిలో కొలెస్ట్రాల్‌ శాతం చాలా తక్కువ, పైగా దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్‌, విటమిన్లు ,కాల్షి యం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ నికోటినిక్‌ ఆసిడ్స్‌ ఉంటాయి.ఈ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుంది. మెలనిన్ అనే పదార్థం ఈ కోడి మాంసంలో ఉండటం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు.

కావలసిన పదార్ధాలు :

కడక్‌నాథ్‌ చికెన్

కరివేపాకు

ఉప్పు

పసుపు

ఉల్లిపాయలు

వెల్లుల్లి

అల్లం

బియ్యం

నూనెపచ్చిమిర్చి

బిర్యానీ మసలా దినుసులు

అల్లం-వెల్లుల్లి పేస్టు

ధనియాలపొడి బిరియాని ఆకులుకొత్తిమీర

తయారీ విధానం :

కడక్‌నాథ్ చికెన్‌ని నీళ్లతో శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో చికెన్‌తోపాటు కరివేపాకు, ఉప్పు, పసుపు, ఉల్లిపాయముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి.

బియ్యాన్ని నానబెట్టి రెడీగా పెట్టుకోవాలి. అల్లం-వెల్లుల్లి పేస్టును సిద్ధంచేసుకోవాలి. బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఒక మట్టి కుండను తీసుకుని స్టవ్‌ మీద పెట్టాలి. కుండ వేడెక్కిన తర్వాత అందులో నూనె లేదా నెయ్యి వేసి బిర్యానీ మసాలా దినుసులు వేగించాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. బియ్యంకొలతకు సరిపడా తగినన్ని నీళ్లు ఆ పేస్టులో పోసి, ఉప్పు వేసి మూతపెట్టి ఆ నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో పోసి పది నిమిషాలు ఉడికించాలి. బియ్యం పొడిపొడిగా ఉండేలా ఉడికిన తర్వాత రెడీగా పెట్టుకున్న కడక్‌నాథ్‌ చికెన్‌ని అందులో వేసి మూతపెట్టాలి.అందులోని నీళ్లు పూర్తిగా ఆవిరయ్యే వరకు సన్నని మంటపై బిర్యానీని ఉడకనిచ్చి తర్వాత స్టవ్‌ నుంచి దించాలి. బిర్యానీపైౖ కొత్తిమీర చల్లాలి...హాట్ హాట్ కడక్‌నాథ్ చికెన్ పాట్ బిర్యానీ రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories