హై హీల్స్ అనారోగ్యాన్నీ తెస్తాయ్

Highlights

చాలా మంది అమ్మాయిలూ ఎత్తుగా కనిపించడం కోసం హై హీల్స్ వాడుతుంటారు. అయితే వాటిని వేసుకునే ముందు హీల్స్ గురించి తెలుసుకోవాలి... సరైన జాగ్రత్తలు...

చాలా మంది అమ్మాయిలూ ఎత్తుగా కనిపించడం కోసం హై హీల్స్ వాడుతుంటారు. అయితే వాటిని వేసుకునే ముందు హీల్స్ గురించి తెలుసుకోవాలి... సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హై హీల్స్ వాడితే తలెత్తే సమస్యలు తలెత్తుతాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక్కసారి చూద్దాం...

పాదం ముందరి భాగం, బొటనవేలు, రెండో వేలు కొద్దిగా కనిపించేలా కట్‌ వ్యాంప్స్‌ ఉన్న హైహీల్స్‌ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు పొడవుగా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి హీల్స్‌ ఎంచుకుంటే ఎత్తుగా కనిపిస్తారు.

మడమ ఎత్తు కారణంగా మోకాలి జాయింట్లపై ఒత్తిడి పెరిగి తొడ భాగంలోని కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో బాడీలో నోప్పులు వస్తాయి. ఒక్కోసారి శాశ్వతంగా నడకను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఎత్తుగా ఉండే హీల్స్‌ వెసుకోకూడదు

హై హీల్స్ వాడకం ద్వారా వచ్చే నొప్పులు పోవాలంటే చాలా కష్టం కూడుకున్నది. అటు డబ్బు ఇటు సమయం వదిలించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హై హీల్స్‌కి దూరంగా ఉండటమే.మేలు.

మన శరీర భారాన్నంతా మోసేది మన కాళ్లే...! మరి వాటి కోసం మనం ఆ మాత్రం ఆలోంచలేమా.. మీకు హీల్స్ వేసుకోవాలని మరీ కోరికగా ఉంటే నిపుణులను సంప్రదించి ఎంత ఎత్తు వరకూ హీల్ వాడవచ్చనే విషయాన్ని తెలుసుకుని వాడితే మంచిది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories