Jackfruit: పనసపండు ఆరోగ్యానికి 5 లాభాలు.. షుగర్‌ ఉన్నవాళ్లు తింటే ఏమవుతుంది తెలుసా?

Jackfruit
x

Jackfruit: పనసపండు ఆరోగ్యానికి 5 లాభాలు.. షుగర్‌ ఉన్నవాళ్లు తింటే ఏమవుతుంది తెలుసా?

Highlights

Jackfruit Health Benefits: మామిడిపండును పండ్ల రారాజు అని పిలుస్తారు. కానీ, పనసపండు (Jackfruit) ను పండ్ల డాక్టర్‌ అని పిలుస్తారని మీకు తెలుసా?

Jackfruit Health Benefits: పనసపండులో పోషకాలు ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదం, యూనానీ మందుల్లో కూడా వినియోగిస్తారు. ఈ పండును ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తారు. పనసను పండుగా మాత్రమే కాదు.. ఏకంగా బిర్యానీ కూడా తయారు చేసుకుంటున్నారు. అయితే, ఈ పనస పండులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

పనస పండు మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. దీన్ని ఎక్కువగా తింటారు కూడా. అయితే, పనస పండులో మాత్రమే కాదు, పనస గింజలో కూడా పోషకాలు పుష్కలం. పనస పండు అరోమా కూడా అదిరిపోతుంది. తీయ్యగా రుచికరంగా కూడా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా పుష్కలం.

పోషకాల గని..

పనస పండు ఒక్క కప్పులో మంచి ఫైబర్‌, ప్రోటీన్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ, రైబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, పొటాషియం, రాగి, మ్యాంగనీస్ కూడా ఉంటుంది. ఈ పనస పండును మనం తీసుకుంటే ఇమ్యూనిటీ బలపడటమే కాదు... చర్మానికి కూడా మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తి..

పనస పండులో విటమిన్‌ సీ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. దీంతో ఎలాంటి సీజనల్‌ రోగాలు వచ్చిన వ్యతిరేకంగా పోరాడే ఇమ్యూనిటీ కూడా లభిస్తుంది.

షుగర్‌ నియంత్రణ..

అవును.. ఈ పోషకాల పండులో గ్లైసెమిక్‌ సూచీ (GI) తక్కువగా ఉంటుంది. అందుకే ఇది డయాబెటీస్‌ వారికి కూడా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. పనసపండులో ఫైబర్‌ కూడా అధిక మోతాదులో ఉండటం వల్ల ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు..

పనస పండులో ఎక్కువ మోతాదులో విటమిన్‌ సీ, కెరోటనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె, కంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.

బరువు నిర్వహణ..

బరువు నిర్వహణలో ఉన్నవారు పనస పండు తినాలి. ఇందులో ఫైబర్‌ ఉంటుంది. కాబట్టి అతిగా ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయంపాటు కల్పిస్తుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.

ఎముక ఆరోగ్యం..

ముఖ్యంగా పనస పండులో మెగ్నీషియం ఉంటుంది. ఇది క్యాల్షియం గ్రహించడంలో కీలకపాత్ర పోషిసత్ఉంది. దీంతో ఎముకలు కూడా బలంగా మారతాయి. పనస తినడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు మన దరిచేరకుండా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories