Hair Fall: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? తల మీద ఇన్ఫెక్షన్ కావచ్చు

Hair Fall
x

Hair Fall: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? తల మీద ఇన్ఫెక్షన్ కావచ్చు

Highlights

Hair Fall: అకస్మాత్తుగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే, అది మామూలు సమస్య కాకపోవచ్చు. మీ తల మీద ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు.

HairFall: అకస్మాత్తుగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే, అది మామూలు సమస్య కాకపోవచ్చు. మీ తల మీద ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు రాలుతోంది. కానీ, జుట్టు ఎక్కువగా రాలడం, తల దురద పెట్టడం, మంటగా ఉండటం లేదా పొలుసులు రావడం వంటివి ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. కొంతమంది చుండ్రు వల్లే జుట్టు రాలుతుందని అనుకుంటారు. కానీ, తల మీద దురద, మంట, పొలుసులు లాంటివి ఉండి, జుట్టు వేర్ల నుంచే ఊడిపోతుంటే, అది ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కావచ్చు. ముఖ్యంగా జుట్టు ఒకే చోట ఎక్కువగా రాలిపోయి, ఎర్రటి మచ్చలు పడుతుంటే అది టినియా క్యాపిటిస్ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది.

తల మీద ఇన్ఫెక్షన్ వస్తే జుట్టు వేర్లు బలహీనపడతాయి. దానివల్లే జుట్టు రాలిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్లు ఫంగస్, బ్యాక్టీరియా లేదా ఈస్ట్ అనే క్రిముల వల్ల వస్తాయి. టినియా క్యాపిటిస్ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ జుట్టు రాలడానికి ముఖ్య కారణం. ఇది చర్మంపై ఎర్రటి, గుండ్రటి గాయాలుగా కనిపిస్తుంది.

ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయంటే..

* మురికిగా ఉన్న జుట్టును తరచుగా కడుక్కోకపోవడం

* ఇతరుల దువ్వెన, టవల్ వాడటం.

* చుండ్రును ఎక్కువ కాలం పట్టించుకోకుండా వదిలేయడం.

* జుట్టు ఆరబెట్టకుండా తడిగా కట్టేయడం

చికిత్స ఎలా చేసుకోవాలి?

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముందుగా తల చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మైల్డ్ యాంటీ-ఫంగల్ షాంపూ వాడాలి. సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తీసుకోవాలి. వేప నీరు, అలోవెరా, లేదా టీ ట్రీ ఆయిల్ వంటి ఇంటి చిట్కాలు కూడా కొంత వరకు సహాయపడతాయి. కానీ, బాగా ఎక్కువైతే మాత్రం డాక్టర్ చికిత్స అవసరం.

చికిత్సకు కొన్ని చిట్కాలు

* తల శుభ్రంగా ఉంచండి. వారానికి 2-3 సార్లు మైల్డ్ యాంటీ-ఫంగల్ షాంపూ వాడండి.

* జుట్టు తడిగా వదిలేయకండి. దువ్వెన లేదా టవల్‌ను ఇతరులతో పంచుకోవద్దు.

* దురద, మంట, లేదా గాయాలు ఎక్కువైతే వెంటనే చర్మ డాక్టర్‌ను కలవండి.

* చిన్నపాటి ఇన్ఫెక్షన్లకు వేప నీరు లేదా అలోవెరా జెల్ వంటి ఇంటి చిట్కాలు వాడవచ్చు.

* సమయానికి చికిత్స చేయించుకుంటే, జుట్టు వేర్లు సురక్షితంగా ఉంటాయి. భవిష్యత్తులో జుట్టు ఎక్కువగా రాలకుండా కాపాడుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories