ముఖంపై టూత్‌పేస్ట్ తో ఇలా చేస్తే..

ముఖంపై టూత్‌పేస్ట్ తో ఇలా చేస్తే..
x
Highlights

అందం అమ్మాయిల సొంతం అంటారు సినీ గేయ రచయితలు. అమ్మాయిలకి అందంమే పెట్టుబడి! అందుకే ఫేస్ లో ఏ మాత్రం కళ తగ్గినా కలవరపడిపోతారు. ముడుతలు లేని చర్మం కోసం...

అందం అమ్మాయిల సొంతం అంటారు సినీ గేయ రచయితలు. అమ్మాయిలకి అందంమే పెట్టుబడి! అందుకే ఫేస్ లో ఏ మాత్రం కళ తగ్గినా కలవరపడిపోతారు. ముడుతలు లేని చర్మం కోసం తహతహలాడుతుంటారు. ఏజ్ కనిపించకుండా ఉండడం కోసం ఎంతగానో ఆరాటం పడతారు. టీనేజ్ మగువలు అందం విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు. ముఖ్యంగా యుక్త వయసు వచ్చే సరికి ముఖంపై చాలమంది మగువలకు మొటిమలు వస్తాయి. మరికొందరికి మచ్చలు, కంటికింద వలయాలు లాంటివి ఉంటాయి. అయితే వీటిని తగ్గించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. దీంతో చాలమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకొని.. ఉన్న అందాన్ని పాడు చేసుకుంటారు.

సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను ఉపయోగించి.. వాటిని ముఖంపై ఆప్లే చేసేవాళ్లు ఉన్నారు. అందులో ఒకటి ముఖంపై టూత్‌పేస్ట్ రాయడం. ఫేసుపై టూత్‌పేస్ట్‌ రాస్తే సమస్య తగ్గుందని చాల మంది అభిప్రాయం. మొటిమలతో ఇబ్బందులు పడేవారు టూత్‌పేస్ట్ అప్లై చేస్తుంటారు. అయితే ఫేస్ పై టూత్ పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా ఆ సమస్య తగ్గుతుంది. కానీ ఫ్యూచర్‌లో మత్రం ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు.

సాధారణంగా టూత్‌పేస్ట్‌లో సోడా, మెంథాల్, షాంపూ, సల్ఫర్ ఉంటుంది. ఇవి దంతాలపై రాస్తాం. దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి.. ఏం కాదు.. కానీ ముఖంపైనున్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పేస్ట్‌లోని కెమికల్స్.. ముఖంపైనున్న చర్మాన్ని పొడిబార్చి మరింత సమస్యకు గురిచేస్తుంది. దీని వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సో.. ముఖంపై టూత్ ‌పేస్ట్ రాయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories