వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటున్న టీనేజ్‌

వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటున్న  టీనేజ్‌
x
Highlights

మా అబ్బాయి చేప్పింది వినడం లేదు. మా అమ్మాయికి ప్రేమామోహాంలో చిక్కుకుపోయింది. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది ఎప్పుడు చాటింగ్‌లతో బీజి. ...

మా అబ్బాయి చేప్పింది వినడం లేదు. మా అమ్మాయికి ప్రేమామోహాంలో చిక్కుకుపోయింది. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది ఎప్పుడు చాటింగ్‌లతో బీజి. అతను స్కూలు మానేసి 'స్మార్ట్‌ ఫోన్‌తో ఆటలు ఆడుతూ గడిపేస్తున్నాడు. ఇలా పిల్లల పట్ల చాలా మంది తల్లిదండ్రుల వేదన. ఇది పెరెంట్స్ సమస్య కాదు ఇప్పుడు ఇదో సామాజిక సమస్యగా మారింది. కొంత అటుఇటుగా చాలా కుటుంబాలలో టీనేజ్‌ ప్రేమలు, సెల్‌ఫోన్‌ వ్యసనాలు ఉంటాయి నాటి ప్రేమలకు ఇప్పటి ప్రేమలకు ఏమాత్రం పోంతన లేదు . దేవదాసు, లైలా, మజ్నులవి మానసిక సాన్నిహిత్యం కలిగిన పవిత్ర ప్రేమలు, ఇప్పటి ప్రేమలన్ని వ్యామోహాలే. వాటికి పవిత్రత ఆపాదించలేకపోతున్నాం. ఎక్కడో ఓ దగ్గర ఒకటి, రెండు శాతం మంది నిజమైన ప్రేమికులు ఉండవచ్చు. చాలా మంది టీనేజ్‌ పిల్లలు వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటున్నారు. హార్మోన్లు ప్రకోపించి వ్యామోహాన్ని అవగాహన లేమితో ప్రేమగా భ్రమిస్తుంటారు. మరికొందరిలో విపరీత ఆకర్షణతో లైంగిక వాంఛ కోసం తపిస్తుంటారు.

కావున అమ్మాయిలకు అబ్బాయిలకు కౌన్సెలింగ్‌ అవపరం. ఇప్పుడు సెల్‌ఫోన్‌ వ్యసనం సమాజానికి సమస్యగా తయారయ్యింది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరు సెల్‌ఫోన్‌, సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నారు. వీటివల్ల మానసిక ఒత్తిడికి గురై కృంగిపోతున్నారు. ఇనాటి టీనేజ్ గ్రూప్‌కి ఖచ్చితంగా కౌన్సెలింగ్‌ అవరం. వివేకకల్పన, ప్రవర్తనలో మార్పు, లక్ష్యనిర్దేశం, ఉపశమన మార్గాల ద్వారా విూపిల్లలను మార్చుకోవచ్చు. కౌన్సెలింగ్‌ వల్ల తప్పకుండా మీ సమస్యలు పరిష్కారమవుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories