టాలెంట్ ఉన్నా సక్సెస్ రావట్లేదా...?

టాలెంట్ ఉన్నా సక్సెస్ రావట్లేదా...?
x
Highlights

చాలామందికి టాలెంట్ ఉన్నా విజయం మాత్రం ఆమడ దూరంలోనే ఉంటుంది. సక్సెస్ కోసం కష్టపడుతున్నా కానీ.. అది వారికి అందనంత దూరంలో పరిగెడుతూ ఉంటుంది. ఒక విధంగా...

చాలామందికి టాలెంట్ ఉన్నా విజయం మాత్రం ఆమడ దూరంలోనే ఉంటుంది. సక్సెస్ కోసం కష్టపడుతున్నా కానీ.. అది వారికి అందనంత దూరంలో పరిగెడుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే విజయం వీరితో దోబూచులాడుతుంది. ప్రయత్నించీ ప్రయత్నించీ చివరికి విసిగిపోయి వైపల్యం చెందుతుంటారు. వారికి ఉన్న ప్రతిభను పూర్తిగా బయటపెట్టిన. విజయం కోసం ప్రయత్నించిన ఫలితం దక్కకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కష్టపడుతున్న విజయం వరించటంలేదని కొందరు అదే పనిగా ఫీలవుతుంటారు. అయితే హార్డ్ వర్క్ ఎంత అవసరమో స్మార్ట్ వర్క్ కూడా అంతే అవసరం. మెదడుకు పదునుపెట్టకుండా మూస పద్దతిలోనే వర్క్ చేస్తూ ఉంటే విజయం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. కాల అణుగుణంగా ట్రెండ్స్ మారుతున్నాయి. ప్రపంచం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఆయా ట్రెండ్స్ కి తగినట్టు టెక్నాలజీని ఉపయోగించుకుని హార్డ్ వర్క్ కి కాస్తంత స్మార్ట్ నెస్ ను జోడించాలి.. మీ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు విసృతంగా అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటే విజయం తప్పక మీ దరి చేరుతుంది.

కొంతమంది ఓపిక ఉండదు. తక్కువ సమయంలోనే అన్ని జరిగిపోవాలని ఆరాటపడతారు. పని పూర్తికాకుండానే ఫలితం అశిస్తారు. విజయం రాకుండానే పలితంపై కొండంత అంచనాలను నెలకొల్పుకుంటారు. ఇలాంటి వారు పనిని శ్రద్ధతో పూర్తిచేయలేరు. రాని ఫలితాన్ని ఊహించుకుని భవిష్యత్తు గురించి ఆలోచించకండి.

వర్తమానంపైనే దృష్టి పెట్టండి. శ్రద్ధగా పనిని పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితులలోనూ నిరాశతో చెంది చేస్తున్న పనిపై అసహనానికి వ్యక్తం చేయకూడదు. అసహనం ప్రవేశించిందంటే పనిలోని నాణ్యత ఉండదు. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ ఆత్మవిశ్వాసం అతిగా మారితే ప్రమాదమే. విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసం కీలక పాత్ర పోషిస్తుంది. విజయం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అతి విశ్వాసం మీకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మన నైపుణ్యంపై మనకు నమ్మకముండాలి. సక్సెస్ అవాలంటే అతిని పక్కనబెట్టాలి. చేపట్టే పనులలో క్రెడిట్ అంతా తమకే రావాలని చాలా మంది ప్రయత్నిస్తారు. ఈ పద్దతి సరికాదు. క్రెడిట్స్ షేర్ చేసుకోవడంలో తప్పులేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories