Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదా ? నిజంగానే గుండెకు మేలు చేస్తుందా ?

Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదా ? నిజంగానే గుండెకు మేలు చేస్తుందా ?
x

Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదా ? నిజంగానే గుండెకు మేలు చేస్తుందా ?

Highlights

రెడ్ వైన్ గురించి సాధారణంగా అందరికీ తెలుసు. ఇది పండ్ల నుండి తయారవుతుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చాలా మంది నమ్ముతారు.

Red Wine : రెడ్ వైన్ గురించి సాధారణంగా అందరికీ తెలుసు. ఇది పండ్ల నుండి తయారవుతుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా, దీనిని తాగడం గుండె, మెదడు, ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతారు. అయితే, మనం ఎప్పుడైనా దీని గురించి ఆలోచించామా? ఇది నిజంగా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందా?..మనలో చాలామంది ఇలాంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచించరు. ఎవరైనా ఏదైనా చెబితే అదే నిజమని నమ్ముతాం. అలాంటప్పుడు, రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిది కాదా? నిజంగా గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరమా? అనే విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

రెడ్ వైన్ ఆరోగ్యానికి ప్రయోజనకరమని చెబుతారు. కానీ దీనిని మితంగా సేవించినట్లయితే మాత్రమే మంచిది. అమృతం కూడా అతిగా తీసుకుంటే విషం అవుతుంది కాబట్టి, వైన్‌ను తక్కువ మొత్తంలో సేవించాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దీనిని తాగడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అయితే, మద్యం సేవించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మితంగా తాగడం మంచిది.

ఆల్కహాల్ ఆరోగ్యకరమైన పానీయం అని ఎప్పుడూ నిరూపించబడలేదు. వైద్యులు చెప్పిన దాని ప్రకారం వైన్ గుండెకు మంచిదని చెబుతారు. అయితే, రెడ్ వైన్‌ను అతిగా తాగడం అంత ప్రయోజనకరం కాదు. ఆహారంలో పండ్లు, ద్రాక్ష, నట్స్ చేర్చుకోవడం ద్వారా అవసరమైన రెస్వెరాట్రాల్ ను పొందవచ్చు. కాబట్టి రెడ్ వైన్‌ను పరిమితంగా తాగడం సరైనది.

అదేవిధంగా, మద్యం తాగే వారిలో తీపి వైన్ చౌకగా లభిస్తుంది అనే తప్పుడు అభిప్రాయం ఉంది. కానీ ఇది నిజం కాదు. ప్రపంచంలో అనేక రకాల తీపి వైన్‌లు ఉన్నాయి, వాటిలో కొన్ని చాలా ఖరీదైనవి. ముఖ్యంగా ఫ్రాన్స్, హంగేరీ దేశాల వైన్‌లు వాటి క్వాలిటీ కారణంగా చాలా ఖరీదైనవిగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories